Featured

C. Kalyan : జయలలిత గారికి బినామీగా ఉంటే తప్పేంటి… వాళ్ళతో పరిచయాలు, డాన్ లాగా ఫీల్ అవుతాను…!

C. Kalyan : సికే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను 2011లో ప్రారంభించి మొదటగా తమిళ సినిమా చంద్రకళ నిర్మించారు కళ్యాణ్. సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత జ్యోతి లక్ష్మి, లోఫర్, జై సింహ సినిమాలు నిర్మించాడు. ఇక రామ్ గోపాల్ వర్మతో వివాదంతో బాగా ఫేమస్ అయిన కళ్యాణ్ అంతకుముందు వందేళ్ల సినిమా వేడుకకు కన్వీనర్ గా వ్యవహరించిన సందర్బంలో కూడా గొడవలతో బాగా ఫేమస్ అయ్యాడు.

జయలలిత బినామీ అయితే ఏంటి…

సి కళ్యాణ్ గురించి మొదటి నుండి వివాదాలు ఉన్నాయి, మద్దెలచెరువు సూరి, నయీం వంటి వారితో సంబంధాలు ఉండి సెటిల్ మెంట్స్ చేసాడు. అయితే దీనికి సి. కళ్యాణ్ వారితో సంబంధాలు ఉంటే తప్పేంటి, డాన్ గా తప్పులు చేయలేదు, డాన్ అనేది ఒక గ్లామర్ అంటూ మాట్లాడారు. ఇక జయలలిత ఆస్తులకు బినామీగా వ్యవహారించారనే వాదనకు సమాధానం ఇచ్చారు. ఉంటే తప్పేంటి వాళ్ళ బంధువులకు గానీ, సన్నిహితులకు గానీ లేని అభ్యంతరం మీకెందుకు, నా తల్లి కంటే జయలలిత అమ్మ నాకు ఎక్కువ. అమ్మ ఇవ్వాలనుకున్నవన్నీ ఇచ్చుంటే జూబ్లీహిల్స్ మొత్తం నా చేతిలో ఉండేది. ఇక అమ్మ చనిపోయినా పై నుండి అన్ని చూస్తుంటుంది, ఆవిడ చుట్టూ ఉన్న వ్యక్తులు తప్పులు చేసుండొచ్చు కానీ ఆమె మనస్తత్వం మంచిది. ఇక ఇప్పటికీ తమిళనాడు మంత్రులు, ఎమ్మెల్యే లు నన్ను ఛాంబర్ కళ్యాణ్ అంటారని చెప్పారు.

ఆవిడ ద్వారా లబ్ది పొంది చనిపోయాక తప్పుగా మాట్లాడితే అమ్మ అన్నీ చూస్తుంటుంది వారికి ఏం జరగాలో అది జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక వందేళ్ల సినిమా వేడుకలకు కన్వీనర్ గా వ్యవహరించడం వల్ల నా పేరు జయలలిత, ప్రణబ్ ముఖర్జీ, రోశయ్య గార్ల పేర్లతో సహా చరిత్రలో ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి అంటూ చెప్పారు. ఇక ఆ సమయంలో వచ్చిన వివాదాలకు ఇలా సమాధానం చెప్పారు. ఆ సమయంలోని విషయాలు ఎవరూ గుర్తుంచుకోరు కేవలం ఎవరు ఆ వేడుక నిర్వహించారు, అతిధులు ఎవరు అన్నదే చరిత్ర లో ఉంటుంది అని వాఖ్యణించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago