Naga Shourya : మొదట ‘చందమామ కథలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా పరిచయం అయినాడు నాగశౌర్య. ‘ఛలో, జో అచ్యుతానంద, వరుడు కావలెను’ సినిమాలతో విజయాలను తన ఖాతలో వేసుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోగానే కాకుండా ఐరా క్రియేషన్స్ స్థాపించి సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా నాగ శౌర్య ఇంట్లో శుభాకార్యం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అమెరికాలో ఘనంగా నాగాశౌర్య అన్న వివాహం…
నాగశౌర్య బ్రదర్ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ఇండస్ట్రీ వాళ్లకు మాత్రం గౌతమ్ బాగా పరిచియం. నాగశౌర్య సినిమాల ప్రమోషన్స్ విషయంలో వాళ్ళ అన్న గౌతమ్ చాలా యాక్టివ్ గా ఉంటారు. యూఎస్ లో నిన్న గౌతమ్ – నమ్రతల వివాహం ఘనంగా జరిగింది. వీళ్ళ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాహ వేడుకకు నాగశౌర్య హాజరు అవ్వలేదు. ఎంత ప్రయత్నించినా తన సినిమాకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి, వారి అంగీకారం తో గౌతమ్ నమ్రత గౌడ పెళ్లి జరిగిందని సమాచారం.
నాగశౌర్య అభిమానులు సోషల్ మీడియా ద్వారా గౌతమ్ నమ్రత గౌడలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మరోవైపు నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఎదురుచూస్థున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కు అభిమానుల నుండి మంచి ఆదరణ వచ్చింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆలస్యమవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…