Ramgopal Varma: మహాభారతంలో నాకు నచ్చిన పాత్ర ద్రౌపతి.. అలాంటి ఉద్దేశం లేదంటూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వర్మ!
Ramgopal Varma: రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు.ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాలలో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే వర్మ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ద్రౌపతి రాష్ట్రపతి అయితే మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు? అంటూ వర్మ అభ్యంతరకరమైన ట్వీట్ చేశారు.
ఈ విధంగా వర్మ రాష్ట్రపతి అభ్యర్థి గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈయన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు వర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా.. మరికొందరు వర్మ ఒక వేస్ట్ ఫెలో అని, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విధంగా వర్మ పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో చివరికి వర్మ తను ఉద్దేశపూర్వకంగా అలాంటి ట్వీట్ చేయడం లేదంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నాకు మహాభారతంలో నచ్చిన పాత్ర ద్రౌపతి. ఇలాంటి పేరు చాలా అరుదుగా ఉంటుంది. ద్రౌపతి పేరు వినగానే అందుకు సంబంధించిన పాత్రల పేర్లు గుర్తుకు వచ్చాయి అని ట్వీట్ చేశారు.
తానం ఉద్దేశపూర్వకంగా ఎవరి సెంటిమెంట్లను కించపరచాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయలేదని వర్మ మరొక ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై స్పందిస్తూ బిజెపి నేత జీఎల్ వీ వర్మ లక్ష్మణ రేఖ దాట్టోద్దని ఆయనను హెచ్చరించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి విమర్శలు సరికాదని, ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పెట్టాలి అంటూ ఈయన వర్మను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. మొత్తానికి వర్మ తను చేసిన ట్వీట్ పై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో చేయలేదని మరొక ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…