Movie News

మహాసముద్రం సినిమాను ముందుగా రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసా?

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం సినిమా దసరా పండుగ స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.ఇందులో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించగా,అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటించారు.

చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో హీరో సిద్ధార్థ్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చాడు.అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథను శర్వానంద్, సిద్ధార్థ్ కంటే ముందుగా 10 మంది హీరోలకు వినిపించగా వారు తిరస్కరించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి వెల్లడించాడు.

మరి మహా సముద్రం సినిమాను రిజెక్ట్ చేసిన ఆ 10 మంది హీరోలు ఎవరు? ఏమిటి ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం..మహాసముద్రం సినిమా కథను రిజెక్ట్ చేసిన హీరోల జాబితాలో రవితేజ, రామ్ పోతినేని,నితిన్, నాని, నాగచైతన్య వంటి హీరోలు ఉన్నారు. అయితే ఈ సినిమాను వారు కథ నచ్చక రిజెక్ట్ చేశారా లేకపోతే వారికీ డేట్స్ కుదరక తిరస్కరించారా అన్న విషయం తెలియరాలేదు.

కానీ ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, సిద్ధార్థ్‌లకు మాత్రం ఈ సినిమా వారి ఆశలు నిరాశలు చేసింది.ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కు భారీగానే స్పందన వచ్చినప్పటికీ సినిమాకు మాత్రం అనుకున్న విధంగా ప్రేక్షకుల నుంచి స్పందన రాలేకపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago