గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి వివిధ దశలలో రూపాంతరం చెందుతూ ప్రజలపై దాడి చేస్తోంది. భారతదేశంలో రెండవ దశ కరోనా ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో అందరికీ తెలిసిందే. ఇక రెండవ దశలో కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది సినీ ప్రముఖులు మృతి చెందారు.ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రోజురోజుకు స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయ నాయకురాలు, బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమెకు అనారోగ్యం చేయడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో గృహనిర్బంధంలోకి వెళ్ళిపోయింది.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అయితే గత కొద్దిరోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్న వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని ఊర్మిళ తెలియజేశారు.
ఇప్పుడిప్పుడే కరోనా నుంచి చిత్ర పరిశ్రమ కోలుకుంటూ ఉండగా మరోసారి కరోనా కేసులు ఉదృతం అవడంతో సినిమా ఇండస్ట్రీలో కాస్త ఆందోళన మొదలైంది. ఈ సారి కనుక కరోనా విజృంభించి వ్యాప్తి చెందే మరొకసారి షూటింగ్స్ వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని సినీ సెలబ్రిటీలు,నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…