స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. వడ్డీ రేటు, బ్యాంకులో పెట్టుబడులపై రాబడి విషయంలో, వినియోగదారులకు మేలు కలిగించే ఇతర స్కీమ్‌లు, అకౌంట్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇక ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ పేరుతో ఓ కొత్త సర్వీస్ అందిస్తోంది. ఈ స్కీమ్ కింద సాధారణ సేవింగ్స్ అకౌంట్లో కంటే అధిక వడ్డీ పొందవచ్చు. ఈ స్కీమ్ కింద ఎస్బీఐ కస్టమర్లు సాధారణ 2.7 శాతం వార్షిక రాబడి కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది.
ఈ అకౌంట్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ తో అనుసంధానమై ఉంటుంది. ఇది మీ అకౌంట్లోనే ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా మరో అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా MOD కింద ఈ టర్మ్ డిపాజిట్ ఓపెన్ చేయాలి. మన సేవింగ్ అకౌంట్లోనే ఈ నగదు సెట్ చేసిన పరిమితిని బట్టి ఆటోమాటిక్ గా MOD లోకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. దీనిని ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ నుంచి నగదు కట్ అవుతుంది.
ఒకవేళ మన టర్మ్ పూర్తికాకముందే అందులోని నగదును మళ్లీ విత్ డ్రా చేసుకోవచ్చు. మెయిన్ బ్యాలెన్స్ లేనప్పుడు ఎప్పడంటే అప్పుడు MOD అకౌంట్లో నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. అప్పటివరకూ మనం అందులో ఉంచిన కాలానికి మాత్రమే వడ్డీ పడుతుంది. దానిలో పరిమితి అమౌంట్ ను రూ. 35 వేలుగా సెట్ చేసుకోవాలి. కనీస మొత్తంలో రూ.10వేల వరకు ఒకేసారి MODగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. సాధారణ SBI సేవింగ్స్ అకౌంట్ మాదిరిగానే.. ఈ అకౌంట్ కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ను కూడా సాధారణ అకౌంట్ మాదిరిగానే అన్నీ సర్వీసుల్లోనూ వినియోగించుకోవచ్చు.
ప్రతీ ఏడాది 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా లభిస్తుంది. MODS అకౌంట్ పై కస్టమర్లు లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ అకౌంటులో గరిష్టంగా ఇంత బ్యాలెన్స్ ఉండాలనే లిమిట్ లేదు. నెలవారీ కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…