Movie News

ఏడు పదుల వయసులో కూడా హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న మెగాస్టార్ విలన్?

సినిమాలలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత సినిమాలలో హీరోతో పాటు విలన్ పాత్రలు కూడా సమానంగా ఉంటూ పోటాపోటీగా ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది విలన్లు ఉన్నారు. బాలకృష్ణ నటించిన “అశోకా చక్రవర్తి”సినిమా ద్వారా విలన్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన నటుడు శరత్ సక్సేనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన నిజానికి బాలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగు సినిమాలలో విలన్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.బాలకృష్ణ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించిన “నిర్ణయం” సినిమా ద్వారా విలన్ గా సందడి చేశారు. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఇతనికి కూడా పెద్ద గుర్తింపు రాలేదు.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ముఠామేస్త్రి”, “ఘరానా మొగుడు”, “ముగ్గురు మొనగాళ్లు”, వంటి చిత్రాలు శరత్ సక్సేనాకు ఎంతో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళిదర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “సింహాద్రి” అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన “బన్నీ” చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

శరత్ సక్సేనా నటించినది తెలుగులో కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సుమారు పదిహేను సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే శరత్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఏడుపదుల వయసులో కూడా ప్రస్తుత హీరోలకు గట్టి పోటీ ఇచ్చే విలన్ గా ఉన్న ఇతని ఫిజిక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం శరత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago