ఒకప్పుడు ఇటు సౌత్ అటు నార్త్ సినిమా ఇండస్ట్రీలలో క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన టబు వయసు ఇప్పుడు దాదాపు 50ఏళ్లు. కానీ ఆమెని ఇంకా ప్రేమదేశం, నిన్నే పెళ్లాడతా సినిమాలలో ఎలా ఉందో అలానే ఊహించుకుంటుంటారు. పక్కా హైదరాబాదీ అయిన టబుకి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితంగా ఉండే ఫ్యామిలీ అంటే ఒక్క నాగార్జునదే. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని సినిమాలలో నటించాలని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్నటితరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువు.
ముంబైలో దివ్య భారతి కెరీర్ ప్రారంభంలో టబుకి పరిచయం అయి బాగా క్లోజ్ అయింది. ఆమె ద్వారానే టబుకి తెలుగులో మొదటి అవకాశం వచ్చింది. 1980లో టబు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెమెరా ముందుకెళ్లింది. ‘బజార్’ అనే చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఐదేళ్లకు ‘హమ్ నౌజవాన్’ లో దేవానంద్‌కి కూతురిగా నటించింది. ఈ రెండు సినిమాలలో టబుకి బాగానే పేరు వచ్చింది. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకొంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోణీకపూర్ తన సంస్థలో నిర్మించిన ‘రూప్‌కీ రాణీ చోరోంకా రాజా’, ‘ప్రేమ్’ సినిమాల కోసం టబుని హీరోయిన్ గా ఎంపిక చేసుకొన్నాడు.
‘ప్రేమ్’ సినిమాలో సంజయ్‌కపూర్ కి జంటగా నటించింది టబు. అయితే సినిమా పూర్తి కావడానికి దాదాపు 8ఏళ్లు పట్టింది. అన్నేళ్ళ తర్వాత విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని అందుకుంది. దాంతో బాలీవుడ్‌లో టబు అవకాశాలకి బ్రేక్ పడింది. అదే సమయంలో దివ్య భారతి టబుని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావుకు పరిచయం చేసింది. ఆ పరిచయంతో ‘కూలీ నెంబర్ 1’ లో అవకాశం అందుకుంది. 1987లో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో టబు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో దండాలయ్య ఉండ్రాలయ్య సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
తెలుగులో ఈ సినిమా తర్వాత టబుకి అనూహ్యంగా బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు రావడం విశేషం. అక్కడ సెలెక్టెడ్‌గా సినిమాలను ఎంచుకిని స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. టబూ అంటే ఇప్పటికీ అందరికీ గుర్తొచ్చే సినిమాలు కూలీ నం.1, ప్రేమదేశం, నిన్నే పెళ్ళాడతా, సిసీంద్రి సినిమాలో ఆటాడుకుందాం రా అందగాడా సాంగ్. ఒకరకంగా టబు నాటి – నేటి తరంలోని యూత్‌కి డ్రీం గర్ల్ అని చెప్పాలి. అటు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమె తమిళ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.
బాలీవుడ్ లో చేసిన ‘మాచీస్’ సినిమాతో టబు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె పరకాయప్రవేశం చేసి నటించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చేసిన వెంటనే ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన కాలపానీ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకురావడంతో తమిళంలో టబుకి అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అయితే తెలుగులో హీరోయిన్‌గా టబు చేసింది చాలా తక్కువ సినిమాలే. ఆవిడ మా ఆవిడే సినిమాలో నాగార్జున సరసన నటించిన టబు మంచి హిట్ అందుకుంది.
కానీ తెలుగులో ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా బాలీవుడ్ మీదే దృష్టి పెట్టింది. లేదంటే ఆమె హిందీ కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసేది. ఇక నాగార్జునతో రిలేషన్ ఉందనే వార్తల వల్ల కూడా టబు ఎక్కువగా ముంబైలో ఉండటానికి ఇష్టపడింది. ఆమె తెలుగులో సినిమాలు ఒప్పుకోకపోవడానికి కూడా ఇదొక కారణం అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటారు. నాగార్జున నిజంగా రిలేషన్ మెయింటైన్ చేసిందా, లేదా అనే విషయం వ్యక్తిగతం. అయితే అక్కినేని ఫ్యామిలీకి మాత్రం చాలా సన్నిహితంగా ఉంటుంది. సినిమాలతో ముంబైలో బిజీగా ఉన్న టబుకి నాగార్జున భార్య అక్కినేని అమల వాళ్ళ ఇంటికి ఎదురుగానే ల్యాండ్ సెలెక్ట్ చేసి దగ్గరుండి మరీ ఇల్లు కట్టించింది. టబుకి ఎప్పుడు ఎలాంటి సమస్య, కష్టం వచ్చినా అర్థరాత్రి అయినా సరే ఫోన్ మోగేది మాత్రం నాగార్జునదే.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…