Subbaraju: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుబ్బరాజు కూడా పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. లేటు వయసులో ఈయన పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పెళ్లి ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఇకపోతే సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించకపోవడంతో తన గురించి అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని అమ్మాయని తెలుస్తుంది ఈమె అమెరికాలో డాక్టర్ గా స్థిరపడ్డారు. ఇలా అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్ గా పని చేస్తున్న స్రవంతి అనే యువతిని సుబ్బరాజు వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం కూడా యూఎస్ఏ లోనే జరిగింది.
ఇలా అమెరికాలో వివాహం చేసుకున్న సుబ్బరాజు త్వరలోనే హైదరాబాద్లో సినీ సెలబ్రిటీల సమక్షంలో రిసెప్షన్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈయన పెళ్లి ఫోటో పై అభిమానులు ఇతర సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన నేపథ్యంలో ఈయన స్పందిస్తూ తమకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా ఒక డాక్టర్ ను ఈయన పెళ్లి చేసుకున్నారనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…