మెజీషియన్ నుండి తన కెరీర్ ని మొదలు పెట్టి ప్రస్తుతం సినిమాలతో దూసుకెళ్తున్న సుడిగాలి సుధీర్ అందరికీ సుపరిచితమే.. ఈ టీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుధీర్ ఇప్పుడు వెండి తెరకి కూడా పరిచయం అయ్యాడు.. అంతే కాకుండా రష్మితో కెమిస్ట్రీ మరియు రూమర్స్ వల్ల చాలా పాపులర్ అయ్యాడు.. వీళ్లిద్దరి మీద చాలా రూమర్స్ వచ్చాయి.. సుధీర్, రష్మి ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఈ రొమాంటిక్ కపుల్ కొట్టిపరేయడం మామూలైపోయింది.. అంతే కాకుండా ఏ ఈవెంట్స్ జరిగినా సుధీర్, రష్మి కోసం ఒక సాంగ్ లేదా షో మొత్తం వాళ్ళిద్దరినీ టార్గెట్ చేసి ప్లాన్ చేస్తారు టీవీషో నిర్వాహకులు.. ఇంతలా రష్మి, సుధీర్ ల ప్రేమాయణం నడుస్తుంటే, ఇపుడు కొత్తగా సుధీర్ మరో కొత్త యాంకర్ తో రొమాన్స్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లుకోడుతుంది..
ఇంతకీ ఆ యాంకర్ ఎవరంటే “పోవే పోరా” షోలో సుధీర్ తో పాటు షో హోస్ట్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఈ మధ్య సుధీర్ విష్ణు ప్రియ పోవే పోరా షోలో రెచ్చిపోయి రొమాన్స్ ఎక్కువ చేస్తున్నారని వార్త వినిపిస్తుంది. అది ఇలా ఉండగా విష్ణు ప్రియ సుధీర్ నీ రాత్రి పార్టీ కి రమ్మని పిలిచింది అనే వార్త కూడా వైరల్ అవుతుంది… ఆగండి ఆగండి… అప్పుడే తప్పుగా అర్ధం చేసుకోకండి ఇది నిజంగా కాదంట.. పోరే పోవా షో కొత్త ప్రోమో రిలీజ్ చేసారు. అందులో “సరిలేరు నీకెవ్వరు” సినిమాలోని “ఆజ్ మేరా ఘర్ పే తూ అజానా..” అంటూ తమన్నా మహేష్ అండ్ కో కి ఇచ్చిన ఆఫర్ లాంటిది. ఇక్కడ కూడా అచ్చం అలంటి ఆఫరే విష్ణు ప్రియ సుధీర్ కి ఇచ్చింది. “పోవే పోరా” ప్రోగ్రాంలో ఆ సాంగ్ కి సుధీర్, విష్ణుప్రియ డాన్స్ చేసారు… అందుకే ఇక నుండి మరో యాంకర్ తో సుధీర్ డాన్స్ లోని రొమాన్స్ ప్రేక్షకులను అలరించనుంది…
పోవే..పోరా.. కొత్త ప్రోమో మీకోసం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…