Movie News

Sudigali Sudheer :సైకలాజికల్ థ్రిల్లర్ గా సుడిగాలి సుధీర్ ’కాలింగ్ సహస్ర’.. ఆకట్టుకుంటున్న టీజర్..!

Sudigali Sudheer : బుల్లితెరపై సుధీర్ అంటే ఒక సంచలనం.జబర్దస్త్ తో మొదలైన ప్రయాణం ఎంతో మంది అభిమానులను సంపాదించుకునేలా చేసింది. బుల్లితెరకి పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక జబర్దస్త్ లోనే కాకుండా ఢీ డాన్స్ షో, కొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు సుధీర్.

ఇక వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సుధీర్. సాఫ్ట్ వేర్ సుధీర్ గా పర్వాలేదనిపించాడు. కానీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక త్రీ మంకీస్ గా వచ్చాడు ఏది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించారు సుడిగాలి సుధీర్. ఇక ఇపుడు కాలింగ్ సహస్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అరుణ్ వక్కిరాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సైకో థ్రిల్లర్. ఇక విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బ్రతకడం కోసం చంపడం సృష్టి ధర్మం.. మరి చంపడం కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది’ అంటూ మొదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ‘ఇప్పటివరకు వాళ్ళు 6000 మందిని చంపారు’ అని శివ బాలాజి మాటలు ఆ సైకోలు ఎంత కిరాతకులో అర్థమవుతుంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ సుధీర్ ఆకట్టుకుంటున్నాడు. ఫైట్స్ సీన్లను కూడా సుధీర్ అద్భుతంగా చేశాడు. టీజర్ భయానకంగా ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది.

తన కామెడీ టైమింగ్, నటన, డాన్సు, ఇక సింగర్ గా కూడా తన టాలెంట్ నిరూపించుకున్న సుధీర్ ఇక ఈ సినిమాతో మంచి విజయం సాధించాలనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో శివబాలాజీ నటించారు. ఇక సుధీర్ కు జోడిగా డాలీషా నటించింది. విజేష్ తయాల్, కాటూరి వెంకటేశ్వర్లు, పామిడి చిరంజీవి సంయుక్తంగా నిర్మించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago