Categories: FeaturedMovie News

సుడిగాలి సుధీర్ తన జిమ్ ట్రైనర్ కు ఇచ్చే జీతం ఎంతో తెలుసా.?!

‘జబర్దస్త్’ అనేది చిన్న కామెడీ షో కాదు. ఈ షో ద్వారా టాలీవుడ్ కి చాలా మంది కొత్త నటీనటులు
పరిచయమయ్యారు. అలా పరిచయమైన జబర్దస్త్ జాబితాలో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉంటారు. ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ పంచ్ లతో నవ్విస్తూనే ఉన్నాడు. ఈమధ్య కాలంలో కమెడియన్ సుడిగాలి సుధీర్ కాస్త హీరోగా కూడా మారారు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ.. ఆ చిత్రం సక్సెస్ అనుకున్నంత సాధించకపోయినా మన సుధీర్ డ్యాన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏదేమైనా కామెడీతో పాటు సుధీర్ డ్యాన్స్ లోనూ అదరగొట్టేస్తాడని నిరూపించుకోవడం విశేషం.

హీరోగా సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రంతో పాటు ప్రముఖ సీనియర్ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా రూపొందించిన 3 మంకీస్ చిత్రంలో కూడా నటించాడు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు మరో సినిమా కూడా చేయబోతున్నాడు సుధీర్. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్ కానీ లేకపోయుంటే ఈపాటికి సుధీర్ క్రొత్త సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్ళి ఉండేది. ఇక అసలు విషయానికొస్తే.. మారుతున్న ట్రెండ్ ను ఫాలో అవుతూ తన లుక్ కూడా మార్చేసాడు సుడిగాలి సుధీర్. తాజాగా గడ్డం మీసాలు పెంచేసి, కోర మీసాలతో కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే ఈ న్యూ లుక్ వెనక చాలా పెద్ద కథే ఉందని టాలీవుడ్ సమాచారం. లాక్‌డౌన్ సందర్భంగా తీరిక సమయాలలో తనను తాను చాలానే మార్చుకున్నాడు సుధీర్. ముఖ్యంగా ఫిజిక్‌పై కూడా దృష్టి సారించాడు సుధీర్.

సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసే ప్రయత్నంలో భాగంగా రోజూ జిమ్ ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. తన ఫిజికల్ జిమ్ ట్రైనర్ కు సుధీర్ 45 రోజులకు లక్షన్నర చొప్పున 3 నెలలకు దాదాపు 3 లక్షలు ఇచ్చాడనే విషయాన్ని స్వయంగా రష్మి గౌతమ్ బయట పెట్టడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య ప్రసారమైన ‘అలీతో సరదాగా’ షోకు అతిథిగా విచ్చేసిన సుధీర్, రష్మీలను అలీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించడంతో సుధీర్ న్యూ లుక్ కోసం వచ్చిన చర్చలోనే రష్మీ ఈ జిమ్ కు సంబంధించిన సీక్రెట్స్ ను బయటపెట్టేసింది. దీంతో ఈ షో చూసిన ప్రేక్షకులందరికీ అసలు సుడిగాలి సుధీర్ ఆస్తి విలువ ఎంతుంటుందనే ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం సుధీర్ ఆస్తిని లెక్క పెడితే దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. ఏడాదికి కనీసం 25 నుంచి 35 లక్షలు మధ్యలో సంపాదిస్తున్నాడు సుధీర్. జబర్దస్త్ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్న సుధీర్ సినిమాల ద్వారా కూడా బాగానే వెనకేసుకుంటున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago