Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు ఉంది. కెరియర్ మొదట్లో ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తూ ఉండేవారు. అయితే జబర్దస్త్ కార్యక్రమం ఈయనకు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.జబర్దస్త్ ద్వారా వేణు వండర్స్ టీంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి సుధీర్ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా వెళ్లారు. ఇలా టీం లీడర్ గా మారిపోయిన సుధీర్ కు ఈ కార్యక్రమంలోనే గెటప్ శీను ఆటో రాంప్రసాద్ పరిచయమయ్యారు.
ఇలా ఈ ముగ్గురు కలిసి స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయడంతో అతి తక్కువ సమయంలోనే వీరికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో రోజురోజుకు ఈ టీమ్ విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకోవడమేకాకుండా రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకున్నారు. ముఖ్యంగా సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు లక్షకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు.
ఈ విధంగా సుధీర్ ఎప్పుడైతే రష్మీతో జతకట్టారో అప్పటినుంచి ఈయనకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ జంటకు బాగా ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది.అయితే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని చాలామంది చెప్పిన వీరు మాత్రం కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుధీర్ ఈ పొజిషన్ లో ఉన్నారు అంటే అందుకు రష్మీ కూడా కారణమని చెప్పాలి.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో టీం లీడర్ గా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ అనంతరం ఢీ,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఒక్కో ఎపిసోడ్ కు జబర్దస్త్ కార్యక్రమంలో ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అయితే మల్లెమాల నుంచి బయటకు రావాలని సుదీర్ భావించడంతో మల్లెమాలవారు ఏకంగా ఏడు లక్షల వరకు ఆఫర్ చేసినప్పటికీ సుధీర్ మాత్రం మల్లెమాల వారి ఆఫర్ తిరస్కరించి స్టార్ మాలో సందడి చేశారు. ఇక ప్రస్తుతం ఇక్కడ సుధీర్ కు రెండింతల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే కార్యక్రమాల కోసం సుదీర్ ఒక్కో షెడ్యూల్ కు 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…