Sujatha -Rakesh: జోర్దార్ వార్తలను చదువుతూ తెలంగాణ యాసలో గడగడా మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుజాత అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎక్కువగా రాకింగ్ రాకేష్ టీంలో చేసేది. ఈ క్రమంలోనే ఈమె రాకింగ్ రాకేష్ తో కలిసి ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జబర్దస్త్ వేదిక పైన తమ ప్రేమ విషయాన్ని తెలియజేశారు. అయితే స్కిట్ లో భాగమని అనుకున్నారు కానీ నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇలా వీరి ప్రేమ విషయాన్ని తెలియజేయడమే కాకుండా పెళ్లికి ముందే పలు ప్రాంతాలకు వెళ్తూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేశారు. ఇలా తమ ప్రేమ విషయాలను అలాగే నిశ్చితార్థం పెళ్లి ఇలా అన్ని వీడియోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక వీరిద్దరి వివాహం జరిగినప్పటికీ జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుజాతకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
పెళ్లి సమయంలో రాకేష్ గారికి ఎంత కట్నం ఇచ్చారు అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుజాత సమాధానం చెబుతూ రాకేష్ గారిని కూడా నేను అదే అడిగాను మీకు ఎంతకట్టం కావాలో ఇప్పుడే అడిగి తీసుకోండి మరీ మరీ అంటే ఇవ్వమని చెప్పాము. అయితే ఆయన మాత్రం నాకు పైసా కట్నం అవసరం లేదని పెళ్లిలో నేను కొనాల్సిన వాటిని కూడా తానే కొనించి నన్ను పెళ్లి చేసుకున్నారని సుజాత తెలిపారు. రాకేష్ నిజంగా ఓ గొప్ప భర్త నాకు ఎన్ని జన్మలో ఉంటే అన్ని జన్మలు తన భర్తగా రావాలి అంటూ తన భర్త మంచితనం గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…