Suma : మనవాళ్ళు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ఒక సినిమాలో చిన్న పాత్ర చేసినా అది గొప్పగా చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బాలీవుడ్ జనాలు సౌత్ లో నటించాలని తహ తహ లాడుతున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. అంతలా క్రేజ్ పెంచాయి మన సినిమాలు. దీనికి బీజం వేసింది మాత్రం మన దర్శక ధీరుడు రాజమౌళినే. ఇక ఇపుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రన్ భీర్ కపూర్, ఆలియా భట్, మౌని రాయ్ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోలో సందడి చేసారు. ప్రోమో వదిలి అందరినీ ఆశ్చర్య పరిచారు మల్లె మాల వాళ్ళు. ఇక ఇందులో సుమ మాత్రం ఒక ప్రశ్నతో రాజమౌళి ని ఇరుకున పెట్టేసింది.
ఆర్ఆర్ఆర్ లో ఎవరు ఫేవరెట్…
బ్రాహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షో కి వచ్చిన రన్ భీర్, ఆలియా భట్, మౌని రాయ్ తమ వచ్చి రాని తెలుగుతో ఆకట్టుకున్నారు. ఇక ఆలియా భట్ గర్భవతి అవ్వడం వల్ల సుమ తెలుగు సంప్రదాయం ప్రకారం చీర సారె ఇచ్చి మన సంప్రదాయం గురించి చెప్పింది. ఇక వారి లవ్ స్టోరీ ముచట్లతో ప్రోమో చాలా ఫన్ గా ఉంటే చివర్లో మాత్రం జక్కన్న ను ఇరుకున పెట్టేసింది సుమ. రాజమౌళి సినిమాలలో హీరోలకు సంబంధించిన ఆయుదాలను రన్ భీర్ కి చూపిస్తూ ఏ సినిమాలో ఆయుధం ఇది అని వివరించగా వీటన్నిటికంటే పెద్దది బ్రహ్మాస్త్ర నాతో ఉంది అంటూ రన్ భీర్ పంచ్ వేసాడు.
ఇక చివర్లో సుమ అడిగే ప్రశ్నలకు వచ్చిన సెలబ్రిటీస్ సమాధానాలు చెబుతారు, ఇక అందులో రాజమౌళి ని ఆర్ఆర్ఆర్ కి సంబంధిచిన ఒక ప్రశ్న అడిగింది సుమ. ఈ సినిమాలో ఇద్దరు హీరోలలో ఎవరు మీ ఫేవరెట్ అని. సినిమా విడుదల అయినా మొదట్లో మా హీరో బాగా చేశాడంటే మా హీరో బాగా చేసాడు అంటూ ఒకవైపు గొడవ పడితే రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ కు ప్రాధాన్యత తగ్గింది అంటూ మరో వివాదం వచ్చింది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ జక్కన్న మీద బాగా కోప్పడ్డారు కూడా. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న సుమ అడిగేసింది. మరి జక్కన్న ఏం సమాధానం చెబుతాడో ఎపిసోడ్ లో చూడాల్సిందే.
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…