Categories: FeaturedMovie News

RGV : రాజమౌళి, ఎన్టీఆర్ ల మీద సటైర్ ఏసిన వర్మ ఫైర్ అవుతున్న అభిమానులు..!

RGV : నిత్యం ఏదో ఒక విషయం గురించి తనదైన శైలి లో స్పందించి ఎవరినో ఒకరిని హర్ట్ చేయడం ఆర్జీవి స్టైల్. విషయం ఏదైనా కాంట్రావెర్సీ కి కేర్ ఆఫ్ మాత్రం ఆర్జీవి నే. మొన్నటికి మొన్న పవన్ ఫ్యాన్స్ ను గెలికాడు. పవన్ పుట్టినరోజు నాడు ఆయనకు విష్ చేయకుండా కేవలం కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుధీప్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను గెలికాడు. రాజమౌళి, ఎన్టీఆర్ ల మీద సోషల్ మీడియా వేదికగా సటైర్లు వేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు. అయినా ఇలా చేయడం వర్మ కు అలవాటే పైగా అందులో కిక్ ఉందన్నట్లు ఫీల్ అవుతుంటాడు.

వాళ్లిద్దరి తెలుగు.. అలా ఉంది…

ఎన్టీఆర్, జక్కన కోసం ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో వీళ్ళిద్దరూ మాట్లాడిన తీరు మీద కామెంట్స్ చేసాడు వర్మ. వీళ్లిద్దరూ మాట్లాడిన తెలుగు కొత్త హిందీలా ఉంది అంటూ సటైర్లు వేశారు. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయాలనుకుంటే తెలంగాణ సర్కారు అనుమతి రద్దు చేసి షాక్ ఇచ్చింది. దీంతో ప్రెస్ మీట్ తో కానిచ్చేసారు బ్రహ్మాస్త్ర ఫిల్మ్ యూనిట్. ఇక ఈ మీట్ లో రాజమౌళి, ఎన్టీఆర్, ఆలియా భట్, రన్ భీర్ కపూర్, కరణ్ జోహార్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 9 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తెలుగు ఛానెల్స్ లో కూడా బ్రహ్మాస్త్ర టీం సందడి చేసారు. ఈ సినిమాకు సౌత్ లో సమర్పకుడిగా రాజమౌళి వ్యవహారిస్తుండడం తో బ్రహ్మాస్త్ర ఈవెంట్ కి ఎన్టీఆర్ ను ముఖ్య అతిధి గా పిలిచి సినిమాకు మంచి హైప్ ఇవ్వాలని భావిస్తే ఈవెంట్ రధ్ధవడం వల్ల సినిమాకు నష్టమనే చెప్పాలి. ఇక అసలే జూనియర్ ఫ్యాన్స్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కోపంగా ఉంటే మళ్ళీ ఇలా సటైర్లు వేసి మరింత నిప్పు రాజేస్తున్నాడు వర్మ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago