Suma Kanakala: బుల్లితెర యాంకర్ గా అందరినీ ఎంతగానో సందడి చేసిన సుమ కనకాల ప్రస్తుతం విజయ్ కలివారపు దర్శకత్వంలో తెరకెక్కిన జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షోతోనే మంచి టాక్ సంపాదించుకుంది.
ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మంచి కథ నైపుణ్యం ఉన్న పాత్రలు దొరికితే తప్పకుండా తను సినిమాలలో నటిస్తానని సుమ వెల్లడించారు. ఈ విధంగా సుమ సినిమాలలో నటిస్తానని చెప్పడంతో ఈమె బుల్లితెరకు దూరమవుతుందా? ఇకపై బుల్లితెరపై సుమను చూడలేమా? అనే సందేహాలు తలెత్తాయి.
ఈ క్రమంలోనే సుమ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై సుమ స్పందించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమ తాను బుల్లితెరను వదిలే ప్రసక్తే లేదని, ప్రస్తుతం తనకు ఇంత గుర్తింపు వచ్చిందంటే కేవలం బుల్లితెర కార్యక్రమాల ద్వారా మాత్రమేనని సుమ తెలిపారు.
ఇలా నాకు అన్నం పెట్టి, నా ఎదుగుదలను ప్రోత్సహించిన బుల్లితెరను ఎట్టిపరిస్థితిలోనూ వదిలే ప్రసక్తే లేదని తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఒక వైపు సినిమా అవకాశాలు వచ్చిన సినిమాలలో నటిస్తూనే బుల్లితెర కార్యక్రమాలను కూడా కొనసాగిస్తానని ఈ సందర్భంగా సుమ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…