Categories: FeaturedMovie News

Suma Kanakala: స్టేజ్ పైనే భర్త రాజీవ్ కనకాలను ఆట పట్టించిన సుమ..!

Suma Kanakala:సుమ కనకాల ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై అన్ని టీవీ ఛానల్ లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్న సుమ ప్రస్తుతం వెండితెరపై జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా వెండితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే సుమా ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ అనే సినిమా మే ఆరో తేదీ విడుదల కానుంది.

Suma Kanakala: స్టేజ్ పైనే భర్త రాజీవ్ కనకాలను అంత మాటన్న సుమ..!

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Suma Kanakala: స్టేజ్ పైనే భర్త రాజీవ్ కనకాలను అంత మాటన్న సుమ..!

ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సుమ భర్త రాజీవ్ కనకాల పాల్గొని ఆయన సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మాట్లాడి వేదికపై నిలబడ్డారు. ఇక రాజీవ్ మాట్లాడిన తర్వాత సుమ మైక్ అందుకొని తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ కాసేపు సరదాగా తన భర్తను ఆట పట్టించింది.

అందరికీ ధన్యవాదాలు…

ఇక వేదికపై మైక్ అందుకున్న సుమ మాట్లాడుతూ.. హలో బాబు మిస్టర్ కనకాల ముందుకు రా నీ వెనకాలే నేను అంటూ సరదాగా తన భర్తను తన మాటలతో ఆట పట్టించారు. ఇక ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో సినిమాలకు ప్రీ రిలీజ్ వేడుకలలో పాల్గొన్నప్పటికీ మొట్టమొదటిసారిగా ఆ వేడుక పూర్తయ్యేవరకు స్టేజిపై ఉన్నానని వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం తను ఎంతో కష్టపడి శ్రీకాకుళం యాస నేర్చుకున్నానని సుమా వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అంటూ సుమ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బుల్లితెరపై తన వాక్చాతుర్యంతో అందరినీ సందడి చేసిన సుమ వెండితెరపై ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago