లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితంలోని సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న తాజా బయోపిక్ చిత్రం 83. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కపిల్ దేవ్ భార్య పాత్రలో రోమి దేవ్ గా రణ్ వీర్ సతీమణి దీపికాపదుకునే నటించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు టాలీవుడ్ హీరో సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు. 83 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేస్తున్నారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా అన్ని భాషలకు సంబంధించిన ట్రైలర్స్ ను ఆవిష్కరించారు.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని హీరో సుమంత్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారనున్నారు. కపిల్ దేవ్ పాత్ర పోషించిన రణ్ వీర్ సింగ్ కీ సుమంత్ వాయిస్ ను అందించారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఫాంటమ్ ఫిలిమ్స్ సమర్పణలో కబీర్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు.
ఇందులో దీపికా పదుకొనే, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నడియావాలా నిర్మాతలుగా వ్యవహరించారు.ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ సందడి చేస్తుంది ఈ సినిమాని తమిళంలో కమల్ హాసన్ మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేస్తుండటం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…