Sundeep Kishan: సందీప్ కిషన్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ సరైన స్థాయిలో మాత్రం ఒక్క హిట్ కూడా పడలేదని చెప్పాలి. ఇలా సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్న ఈయనకు మాత్రం సక్సెస్ కలిసి రాలేదని చెప్పాలి.
ఇటీవల కెప్టెన్ మిల్లర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్ అనే సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ రాయన్ సినిమాలో తాను నటించిన పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని తెలిపారు. నిజానికి ఈ కథ ధనుష్ రాసుకున్నారు. ఒకరోజు ఆయన ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెబుతూ అది నా కోసం రాసుకున్న పాత్ర నువ్వు చేయాలి అని చెప్పారు.. ఆయన అలా చెప్పగానే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేశాను.
ధనుష్ గారు తన కోసం రాసుకున్న పాత్ర నాకిచ్చారు అంటే అది నాకు దక్కిన గౌరవమే కదా. ఇక తాను సక్సెస్ అందుకోలేదని చాలామంది భావిస్తున్నారు. కానీ నాకు మాత్రం వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే నేను నటించిన సినిమాలకు సక్సెస్ టాక్ రాకపోయినా కలెక్షన్లు బాగా వస్తున్నాయని అర్థం.నా పని నేను సరిగ్గా చేస్తే ప్రేక్షకులకు చేరువవుతాను అని నమ్ముతాను. గత 14 ఏళ్లుగా అదే చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…