పుష్ప చాలా అంచనాల మధ్య నిన్నినే విడుదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ వచ్చి భారీ మాస్ మసాల మూవీ. రంగస్థలం సక్సెస్ తరువాత సుకుమార్, అల వైకుంఠపురం తరువాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే మూవీ రిలీజ్ కు ముందే సినిమా బిజినెస్ కూడా బాగా నడిచింది.
అయితే పుష్ఫ అనుకున్నంత అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అంటోంది. ముఖ్యంగా చాలా వైవిధ్యంగా ఉంటుందనుకున్న సునీల్ మంగళం శ్రీను పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఎంత శ్రద్ద పెట్టి క్యారెక్టర్ చేసినా.. సునీల్ విలనీజంలో కామెడి తాలూకు ఛాయలే కనిపించాయని సగటు ఆడియన్స్ అనుకుంటున్నారు. విలన్ అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ కు.. చాలా రోజుల తరువాత పుష్ఫ సినిమాలో పర్పెక్ట్ క్యారెక్టర్ పడిందనుకున్నారు జనాలు.
అయితే సినిమాలో చూస్తే సునీల్ క్యారెక్టరైజేషన్ తేలిపోయింది. ముందుగా కమెడియన్ గా ఉన్న సునీల్ ను విలన్ పాత్రలో ఊహించుకోలేకపోయారు ప్రేక్షకులు. ఇక్కడే ముందుగా సునీల్ విలనిజంపై దెబ్బపడింది. సుకుమార్ మాత్రం మంగళం శ్రీను పాత్రకు సునీల్ కరెక్ట్ అనుకున్నప్పటికీ సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాల్లో కమెడియన్ కనిపించాడని అంటున్నారు. సునీల్ ను క్రూరమైన విలన్ గా చూపిద్దాం అని అనుకున్నా… సినిమాలో ఆరేంజ్ లో సునీల్ క్యారెక్టర్ లేదని తెలుస్తోంది.
ముఖ్యంగా ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా పుష్ప రాజ్ ను చేసినప్పుడు.. మంగళం శ్రీను తన బావమరిది శవం పెట్టె మీదే తను ఉన్నాడని తెలిసినప్పడు.. సునీల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ తనలో విలన్ కన్నా కమెడియన్ నే ఎక్కువగా చూపించాయని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు. ఇంతకుముందు కలర్ ఫోటో సినిమాలో సునీల్ ను విలన్ గా చూపించినప్పుడు.. విలన్ క్యారెక్టర్ కు బాగా న్యాయం చేశాడని ఆడియన్స్ అనుకున్నారు. అయితే మంగళం శ్రీను పాత్రలో మాత్రం సునీల్ విఫలమయ్యాడని తెలుస్తోంది. అనవసరంగా సునీల్ ఈ పాత్రను చేసి బ్లేమ్ అయ్యాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…