Featured

అరేయ్ ఏంట్రా ఇది..మీరు స్నేహితులా.. ప్రేమికులా.. నెటిజన్ల ట్రోలింగ్స్..!

బిగ్ బాస్ ఐదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇన్నాళ్ల నుంచి ఆడియన్స్ ను అలరిస్తున్న బిగ్ బాస్ .. ఈ వారంతో ముగియనుంది. దీంతో ఈ వారం విన్నర్ ఎవరో తెలియనుంది. ముఖ్యంగా షన్ముఖ్, సిరిల మధ్య బంధం మధ్య ఏదో ఉందని నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా షన్ముఖ్, సిరిల మధ్య రోమాంటిక్ హగ్గింగులు..కెమిస్ట్రీ అనేక చర్చలకు తావిచ్చాయి. 

ఇదిలా ఉంచితే శుక్రవారం ఎపిసోడ్ లో కార్డ్ చూసి జాతకాలు చెప్పే లేడి బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చింది. అయితే కార్డులను చూసి హౌజ్ లోని సభ్యుల జాతకాలు చెప్పింది. సన్నీ ఎంపరర్ అని..అతని కెరీర్ బిగ్ బాస్ తరువాత నుంచి ప్రారంభం అవుతుందని అంది. అయితే జీవితంలో లవ్ కూడా ఉందని.. కెరీర్ తరువాతే ప్రేమ అని చెప్పింది. మరో కంటెస్టెంట్ శ్రీరామ్ లవ్ లైఫ్ బాగుంటుందని అంది. మానస్ కామ్ గోయింగ్ అని అంది. సిరి గురించి చాలా చెప్పింది. త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయని అంది. ఇక షన్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పింది. షన్ముఖ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లాక అన్ని బాగానే జరుగుతాయని, ఆర్థికంగా నిలదొక్కుకుంటాడని.. లవ్ లైఫ్ కూడా బాగుంటుందని.. ఫారన్ వెళ్లే ఛాన్సుందని, అన్ని బాగా జరుగుతాయంది. అయితే ఓ ప్రముఖ ఛానెల్ లో మూడ నమ్మకాలను పెంచే విధంగా ఈ జాతకాలను చెప్పించడం ఏంటని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. 

జాతకాల సెషన్ పూర్తయ్యాక మరోసారి షన్ముఖ్, సిరిల మద్య వివాదం రాజుకుంది. పొద్దున వేసిన దోశలు ఎవరు తినలేదని.. మళ్లీ ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేశావని అరిచాడు షన్ముఖ్. దీనికి తిన్నారో.. తినలేదో తెలియదని.. తాను చూడలేదని బదులిచ్చింది సిరి. దీనికి షన్నూ చూసుకోవాలి కదా… చెబితే వినాలి కదా అని అరిచాడు.  ఇది జరిగిన తర్వాత అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఫైనల్ కన్నా ముందే ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రకటించాడు. దీంతో అందరు కంటెస్టెంట్లు షాక్ తిన్నారు. ఎలిమినేట్ అయ్యేవారు ఎవరో తేల్చుకోవాలని కంటెస్టెంట్లకు సూచిస్తే.. మానస్‌.. షణ్ముఖ్‌ పేరుని చెప్పగా, షణ్ముఖ్‌ సన్నీ పేరుని, సిరి, మానస్‌ పేరుని, శ్రీరామ్‌ సిరి పేరుని, సన్నీ, షణ్ముఖ్‌ పేరుని సూచించారు. అయితే బిగ్‌బాస్‌ మాత్రం సిరిని హౌజ్‌ నుంచి వెళ్లిపోవాలని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

అయితే సిరి ఇంటి నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో షన్ముఖ్, సిరి మధ్యలో భావోద్వేగాలు తారా స్థాయికి చేరాయి. గేట్ వద్దే కూర్చోని కన్నీళ్లు పెట్టాడు షన్ముఖ్. అయితే సిరిని కొద్ది సేపు సీక్రెట్ రూంలో ఉంచి.. మళ్లీ హౌజ్ లోకి పంపాడు బిగ్ బాస్. దీంతో మరోసారి షన్ముఖ్, సిరి కౌగింలించుకొని.. గాఢ ప్రేమికుల మాదిరిగా బిహేవ్ చేయడం మరోసారి ఈ ఇద్దరి మధ్య బంధం గురించి అనుమానాలను క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు స్నేహితుల లేక ప్రేమికుల అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago