బిగ్ బాస్ ఐదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇన్నాళ్ల నుంచి ఆడియన్స్ ను అలరిస్తున్న బిగ్ బాస్ .. ఈ వారంతో ముగియనుంది. దీంతో ఈ వారం విన్నర్ ఎవరో తెలియనుంది. ముఖ్యంగా షన్ముఖ్, సిరిల మధ్య బంధం మధ్య ఏదో ఉందని నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా షన్ముఖ్, సిరిల మధ్య రోమాంటిక్ హగ్గింగులు..కెమిస్ట్రీ అనేక చర్చలకు తావిచ్చాయి.

ఇదిలా ఉంచితే శుక్రవారం ఎపిసోడ్ లో కార్డ్ చూసి జాతకాలు చెప్పే లేడి బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చింది. అయితే కార్డులను చూసి హౌజ్ లోని సభ్యుల జాతకాలు చెప్పింది. సన్నీ ఎంపరర్ అని..అతని కెరీర్ బిగ్ బాస్ తరువాత నుంచి ప్రారంభం అవుతుందని అంది. అయితే జీవితంలో లవ్ కూడా ఉందని.. కెరీర్ తరువాతే ప్రేమ అని చెప్పింది. మరో కంటెస్టెంట్ శ్రీరామ్ లవ్ లైఫ్ బాగుంటుందని అంది. మానస్ కామ్ గోయింగ్ అని అంది. సిరి గురించి చాలా చెప్పింది. త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయని అంది. ఇక షన్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పింది. షన్ముఖ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లాక అన్ని బాగానే జరుగుతాయని, ఆర్థికంగా నిలదొక్కుకుంటాడని.. లవ్ లైఫ్ కూడా బాగుంటుందని.. ఫారన్ వెళ్లే ఛాన్సుందని, అన్ని బాగా జరుగుతాయంది. అయితే ఓ ప్రముఖ ఛానెల్ లో మూడ నమ్మకాలను పెంచే విధంగా ఈ జాతకాలను చెప్పించడం ఏంటని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
జాతకాల సెషన్ పూర్తయ్యాక మరోసారి షన్ముఖ్, సిరిల మద్య వివాదం రాజుకుంది. పొద్దున వేసిన దోశలు ఎవరు తినలేదని.. మళ్లీ ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేశావని అరిచాడు షన్ముఖ్. దీనికి తిన్నారో.. తినలేదో తెలియదని.. తాను చూడలేదని బదులిచ్చింది సిరి. దీనికి షన్నూ చూసుకోవాలి కదా… చెబితే వినాలి కదా అని అరిచాడు. ఇది జరిగిన తర్వాత అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఫైనల్ కన్నా ముందే ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రకటించాడు. దీంతో అందరు కంటెస్టెంట్లు షాక్ తిన్నారు. ఎలిమినేట్ అయ్యేవారు ఎవరో తేల్చుకోవాలని కంటెస్టెంట్లకు సూచిస్తే.. మానస్.. షణ్ముఖ్ పేరుని చెప్పగా, షణ్ముఖ్ సన్నీ పేరుని, సిరి, మానస్ పేరుని, శ్రీరామ్ సిరి పేరుని, సన్నీ, షణ్ముఖ్ పేరుని సూచించారు. అయితే బిగ్‌బాస్ మాత్రం సిరిని హౌజ్ నుంచి వెళ్లిపోవాలని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే సిరి ఇంటి నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో షన్ముఖ్, సిరి మధ్యలో భావోద్వేగాలు తారా స్థాయికి చేరాయి. గేట్ వద్దే కూర్చోని కన్నీళ్లు పెట్టాడు షన్ముఖ్. అయితే సిరిని కొద్ది సేపు సీక్రెట్ రూంలో ఉంచి.. మళ్లీ హౌజ్ లోకి పంపాడు బిగ్ బాస్. దీంతో మరోసారి షన్ముఖ్, సిరి కౌగింలించుకొని.. గాఢ ప్రేమికుల మాదిరిగా బిహేవ్ చేయడం మరోసారి ఈ ఇద్దరి మధ్య బంధం గురించి అనుమానాలను క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు స్నేహితుల లేక ప్రేమికుల అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
































