బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. టైటిల్ పోరులో 5గురు ఉన్నారు. షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామచంద్ర మరియు మానస్ ఉన్నారు. అందులో సన్నీ, షణ్ముఖ్ , శ్రీరామ చంద్ర మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఇక శ్రీరామచంద్రకు మొదటి రోజున అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే .. మొదటి స్థానంలో దూసుకుపోయడు.
అదే ఓటింగ్ అధికారక ఓటింగ్ లో కూడా కొనసాగితే.. టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీరామచంద్రకు విపరీతంగా సెలబ్రిటీల నుంచి మద్ధతు లభించింది. ఎవరికి వారు జంటలు జంటలుగా ఉండగా.. హౌస్ లో కేవలం శ్రీరామచంద్ర ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఐస్ టాస్క్ లో అతడు గాయపడిన విషయం తెలిసిందే.. దాని తర్వాత అతడు చాలా ఇబ్బందులకు గరయ్యాడు.
దాదాపు మంచానికే పరిమితం అయ్యాడు. ఈ సింపతీ ఒట్లు కూడా శ్రీరామచంద్రకు పడ్డాయని తెలిసింది. ఇక రాను రాను సీన్ రివర్స్ అయిపోయింది. సన్నీ మొదటి స్థానంలో ఉండగా.. శ్రీరామ చంద్ర మూడో స్థానానికి పడిపోయాడు. నాలుగో స్థానంలో మానస్ ఉండగా.. సిరి చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక సిరిని ఫేక్ ఎలిమినేట్ చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
సిరి ఎలాగో చివరి స్థానంలో ఉంది.. ఇక ఆమెకు ఉన్న ఫ్యాన్స్ షణ్ముఖ్ కు ఓట్లు ఎక్కువగా పడే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. షణ్ముఖ్ తోడు ఇంటి నుంచి వెల్లిపోవడంతో.. షణ్ముఖ్ విపరీతంగా కన్నీరుమున్నీరుగా విలపించడం.. వీరి ఫ్రెండ్‌షిప్‌ను హైలైట్ చేయడం కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా వాడని చాలామందికి సిరి ఫేక్ ఎలిమినేషన్ అని తెలియదు. ఇలా హౌలెట్ చేసి.. ఓట్లను క్రాస్ చేయడానికి చేసిన ప్లాన్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. టైటిల్ పోరులో సన్నీ, షణ్ముఖ్ మధ్యనే ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…