Categories: FeaturedMovie News

అర్జున్ తన శరీరాకృతిని కాపాడుకోవడానికి ఎన్ని పాట్లు పడతాడో తెలుసా.. ?

సినిమా ఫీల్డ్‌లో ఉన్న చాలా మందికి ఎలాంటి వ్యసనాలూ లేవని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి స్పష్టం చేశారు. వాళ్లలో ఏవీఎస్, బ్రహ్మనందం అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ లిస్ట్‌లో ఉంటారని ఆయన అన్నారు. సినిమా వల్ల వ్యసనపరులైన వాళ్లు చాలా తక్కువ అని ఆయన చెప్పారు.

ఇక నిజం చెప్పాలంటే హీరో అంటే ఏదో అనుకుంటాం గానీ, వాళ్లు చాలా కష్టపడతారని తనికెళ్ల భరణి అన్నారు. వాళ్లు పడే కష్టం చూస్తే కళ్లకు నీళ్లు వస్తాయని, మామూలు శ్రమ ఉండదు వాళ్లకు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాను ముందు నుంచీ చూస్తున్న నటులలో ఒకరైన అల్లు అర్జున్ చాలా కష్టపడతారని ఆయన తెలిపారు. ఆయన డ్యాన్స్‌లో పడే కష్టం, ఒక స్టెప్ కొంచెం తప్పు వచ్చినా మళ్లీ చేస్తారని తనికెళ్లభరణి, బన్నీ గురించి చెప్పారు. వాళ్ల పక్కనే బాడీ గార్డులా ఉండే డైటింగ్ స్పెషలిస్ట్‌లు వాళ్లను ఏం తిననివ్వరు, తాగనివ్వరని ఆయన అన్నారు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని కేవలం ఆ శరీర ఆకృతిని కాపాడుకునే శ్రమతో పోలిస్తే తమ కష్టం ఏమీ ఉండదని ఆయన వివరించారు.

అందుకే వాళ్లు అంత కష్టపడుతున్నందుకు అంత డబ్బు ఇస్తున్నారని, లేదా అంత డబ్బు ఇస్తున్నందుకు అంత కష్టపడుతున్నారని దానికి ఏదైనా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఆ విషయంలో హీరోయిన్లు కూడా అంతే సమానంగా కష్టపడతారని తనికెళ్ల భరణి అన్నారు. ఏదైనా తినాలన్నా కూడా వాళ్లు చాలా ఆలోచిస్తారని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని, ఆయన చెప్పారు. మామూలు వాళ్లైనా నిర్లక్ష్యంగా ఉంటారేమో గానీ సినిమా వాళ్లు మాత్రం ఎలాంటి వ్యసనాలకు దగ్గర కారని ఆయన మరోసారి చెప్పుకొచ్చారు. లేదంటే వాళ్లకు అసలు సినిమా అవకాశాలు రావు కదా అని ఆయన చెప్పారు. కాబట్టి సినిమా కూడా తమకి క్రమశిక్షణను నేర్పిస్తుంది, గౌరవాన్ని కూడ తెచ్చిపెడుతుందని ఆయన తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago