చిత్ర నిర్మాణ సంస్థల్లో నటరత్న ఎన్టీఆర్ కు చెందిన NAT కి విశిష్ట స్థానం ఉంది. సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. ఉమ్మడి కుటుంబ చిత్రాలు దాదాపు ఈ సంస్థ మీదే వచ్చాయి.
ఇకపోతే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం తర్వాత సంస్థ పేరును రామకృష్ణ NAT గా మార్చారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ 200 వ చిత్రం కోడలు దిద్దిన కాపురం ను ఎన్టీఆర్ ఎస్టేట్స్ పేరు మీద నిర్మించారు. ఈ సినిమాలో కథ మొత్తం పెద్ద కోడలు చుట్టే తిరుగుతుంది. ఆ సమయంలోనూ ఎన్టీఆర్ ఇది తన 200వ చిత్రం కాబట్టి తనకు ఇంపార్టెన్స్ ఉండాలని ఏమాత్రం పట్టు పట్టలేదు. కథ ముఖ్యం గానీ ఇంకేమీ ముఖ్యం కాదని ఆయన అన్నారట. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ఎన్టీఆరే రాశారు.
ఇక ఈ సినిమా మొదటి కాపీ వచ్చాక దాన్ని సెన్సార్ కి పంపించారు. ఈ సినిమాలో సత్యనారాయణ పోషించిన దొంగ బాబా గెటప్ భగవాన్ సత్యసాయి బాబాను పోలి ఉండడం కొందరు సెన్సార్ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలని వారు పట్టు పట్టారు. దాని మీద వాదోపవాదాలు కూడా జరిగాయి. ఐనా కూడా లాభం లేకపోవడంతో బొంబాయిలో సెంట్రల్ సెన్సార్ ఆఫీస్ కి వెళ్ళారు. అక్కడ క్లియరెన్స్ లభించడంతో అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేశారు ఎన్టీఆర్. వినోదాత్మక కథతో తీసిన కోడలు దిద్దిన కాపురం సినిమా సూపర్ హిట్ అయింది. 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఎక్కువ రోజులు ఆడడమే కాకుండా ఉత్తమ చిత్రంగా బంగారు నందిని కూడా సొంతం చేసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…