ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలైన ఆర్య, రాశీఖన్నాల హర్రర్-కామెడీ అరణ్మనై 3 ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం తమిళంలో విడుదలైంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇప్పుడు ‘అంతఃపురం’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్, అవని సినిమాక్స్ ప్రైవేట్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ‘అంతఃపురం’ డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ‘అరణ్మనై’ ‘చంద్రకళ’గా, ‘అరణ్మనై 2’ ‘కళావతి’గా విడుదలైంది. రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. మూడో విడతకు తమిళంలో కూడా మంచి స్పందన వచ్చింది.
మనోబాల, యోగి బాబు, సాక్షి అగర్వాల్ , వివేక్, ఇతర కీలక పాత్రలలో సమిష్టి తారాగణం నటించారు. హారర్-కామెడీ చిత్రం అరణ్మనై కు మూడో భాగం కొనసాగింపుగా సుందర్ సి దర్శకత్వంలో తెలుగులో అంతఃపురం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా పాత్ర గురించి మాట్లాడితే.. ఆమె కెరీర్ లో మొదటి సారి ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఆ పాత్రను సెలెక్ట్ చేసుకున్నారు. ఓ అంతఃపురంలో జరిగే సన్నివేశాలు ఆధ్యంతం కామెడీతో పాటు.. హర్రర్ యాంగిల్ లో నడుస్తుందని దర్శకుడు తెలిపాడు.
అందులో ఉన్న ఆత్మ ఎవరిపై ప్రతీకారం తీర్చకుందనేది మెయిన్ స్టోరీ అన్నాడు. ”తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని… హారర్, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని.. అన్నారు. మరిన్ని వివరాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వెల్లడిస్తానని తెలిపాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సత్య. సి పని చేశాడు. యాక్షన్ సన్ని వేశాలు పీటర్ హెయిన్ తెరకెక్కించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…