Featured

‘వీడెవడో పిచ్చోడు అనుకున్నా’.. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ పై ప్రెస్ మీట్ లో జక్కన్న వ్యాఖ్యలు..!

తెలుగులోనే కాదు నేషనల్ వైడ్ గా దర్శకత్వంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అతడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా.. మినిమం గ్యారెంటీ హిట్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది.
SS రాజమౌళి తన ధర్మ ప్రొడక్షన్స్ కింద కరణ్ జోహార్ అతిపెద్ద చిత్రం “బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ “ని దక్షిణ భారత భాషలలో అందించనున్నారు.

ఈరోజు ఉదయం హైదరాబాద్ లో దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అతడు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం కరణ్ జోహార్ తనకు ఫోన్ చేసి బ్రహ్మాస్త్రం అనే సినిమా తీస్తున్నానని.. అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అని చెప్పాడన్నారు. ఒక రోజు మిమ్మల్ని అయాన్ ముఖర్జి కలుస్తాడు అనగానే ఒకే రమ్మని చెప్పాను అని జక్కన్న తెలిపాడు.

ఇక అయాన్ తో కూర్చొని మాట్లాడుతుండగా.. 15 నుంచి 20 నిమిషాల తన మనసులో ‘ వీడెవడో నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడని’ అనుకున్నా అన్నాడు. ఆయన సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్పాడు. నాకు సినిమాలపై ఎంత పిచ్చి ఉందో అతడికి కూడా అంతే ఉందన్నారు. తను పెంచుకున్న ప్రేమ అలా ఉందని అన్నాడు. ఈ స్టోరీ లైన్ చెబుతుంటే.. బ్రహ్మాండాన్ని క్రియేట్ చేస్తున్నాడని అనిపించదన్నారు.

అతడి కారణంగానే ఈ సినిమాలో అసోసియేట్ అవ్వాలనిపించిదన్నారు. బ్రహ్మాస్త్ర హిందీ మోషన్ పోస్టర్‌ను భారీగా లాంచ్ చేసిన తర్వాత.. రణబీర్ కపూర్, అలియా భట్, అయాన్ ముఖర్జీ తెలుగు పోస్టర్‌ను లాంచ్ చేయడానికి రాజమౌళి, నాగార్జున అక్కినేనితో చేరారు. ఈ చిత్రం మొదటి మోషన్ పోస్టర్‌ను సౌత్ ప్రేక్షకులతో పంచుకున్నారు. రణబీర్, ఆలియా జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వేడుకలో రాజమౌళి, కరణ్ జోహర్, నాగార్జున స్పీచ్ ఆకట్టుకున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago