తెలుగులోనే కాదు నేషనల్ వైడ్ గా దర్శకత్వంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అతడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా.. మినిమం గ్యారెంటీ హిట్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది.
SS రాజమౌళి తన ధర్మ ప్రొడక్షన్స్ కింద కరణ్ జోహార్ అతిపెద్ద చిత్రం “బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ “ని దక్షిణ భారత భాషలలో అందించనున్నారు.

ఈరోజు ఉదయం హైదరాబాద్ లో దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అతడు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం కరణ్ జోహార్ తనకు ఫోన్ చేసి బ్రహ్మాస్త్రం అనే సినిమా తీస్తున్నానని.. అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అని చెప్పాడన్నారు. ఒక రోజు మిమ్మల్ని అయాన్ ముఖర్జి కలుస్తాడు అనగానే ఒకే రమ్మని చెప్పాను అని జక్కన్న తెలిపాడు.
ఇక అయాన్ తో కూర్చొని మాట్లాడుతుండగా.. 15 నుంచి 20 నిమిషాల తన మనసులో ‘ వీడెవడో నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడని’ అనుకున్నా అన్నాడు. ఆయన సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్పాడు. నాకు సినిమాలపై ఎంత పిచ్చి ఉందో అతడికి కూడా అంతే ఉందన్నారు. తను పెంచుకున్న ప్రేమ అలా ఉందని అన్నాడు. ఈ స్టోరీ లైన్ చెబుతుంటే.. బ్రహ్మాండాన్ని క్రియేట్ చేస్తున్నాడని అనిపించదన్నారు.
అతడి కారణంగానే ఈ సినిమాలో అసోసియేట్ అవ్వాలనిపించిదన్నారు. బ్రహ్మాస్త్ర హిందీ మోషన్ పోస్టర్‌ను భారీగా లాంచ్ చేసిన తర్వాత.. రణబీర్ కపూర్, అలియా భట్, అయాన్ ముఖర్జీ తెలుగు పోస్టర్‌ను లాంచ్ చేయడానికి రాజమౌళి, నాగార్జున అక్కినేనితో చేరారు. ఈ చిత్రం మొదటి మోషన్ పోస్టర్‌ను సౌత్ ప్రేక్షకులతో పంచుకున్నారు. రణబీర్, ఆలియా జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వేడుకలో రాజమౌళి, కరణ్ జోహర్, నాగార్జున స్పీచ్ ఆకట్టుకున్నాయి.































