Featured

ఒలంపిక్సే టార్గెట్.. దానికి అనుగుణంగానే ప్రయత్నాలు..యాక్టర్ మాధవన్!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఎంపిక, క్యారెక్టరైజేషన్ లో చాలా శ్రద్ద చూపిస్తుంటాడు. క్యారెక్టర్ మంచిది దొరకాలే.. కానీ హిందీ, తెలుగు, తమిళం అనే భాష చూడకుండా సినిమాలు చేస్తుంటాడు. అయితే అలాంటి మాధనవన్ తన కొడుకును సినిమా ఫీల్డ్ వైపు కాకుండా అందుకు భిన్నంగా వేరే మార్గంలో నడిపిస్తున్నాడు. 

సాధారణంగా స్టార్ హీరోల కొడుకులు తమ వారసత్వాన్ని నిలబెట్టేందుకు సినీ రంగంవైపే ప్రోత్సహిస్తుంటారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, సాండల్ వుడ్, మాలీవుడ్ లలో స్టార్ హీరోల కొడుకులు, కూతుళ్లు సినిమా ఇండస్ట్రీ వైపే వచ్చారు. నటన సరిగా రాకపోయినా.. ఇండస్ట్రీలో స్థిరపడిన వారిని చాలా మందినే మనం చూశాం. 

కానీ మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా తన కొడుకు వేదాంత్ ను వేరే రంగం వైపు ప్రోత్సహిస్తున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ నేషనల్ లెవల్ స్విమ్మింగ్ ఛాంపియన్. మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 7 మెడల్స్ ను గెలిచాడు. భారత్ తరుఫున వేదాంత్ 2026 ఒలంపిక్స్ లో ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అయితే కొడుకు కెరీర్ కోసం కష్టపడుతున్నాడు మాధవన్. కోవిడ్ ఆంక్షల కారణంగా ఇండియాలో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేవు. దీంతో కొడుకును శిక్షణ నిమిత్తం మాధవన్, భార్య సరితలతో కలిసి దుబాయ్ తీసుకెళ్లాడు. 

కోవిడ్ ఆంక్షల వల్ల ముంబైలో పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేవు. దుబాయ్ లో ఒలింపిక్స్ స్థాయిలో స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో ఉండటంతో ఇక్కడికి వచ్చామని మాధవన్ తెలిపాడు. తన కొడుకుకి సినిమారంగంపై ఆసక్తి లేదు. అందుకే తను ఇష్టపడిన రంగంలో ప్రోత్సహిస్తున్నాం అని చెబుతున్నాడు. తన కొడుకు స్మిమ్మింగ్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు గెలుస్తున్నాడని.. మేము గర్వపడేలా చేస్తున్నాడని చెబుతున్నాడు మాధవన్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago