హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది..ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఆర్టీసీ డిపో సమీపంలో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి.. హెచ్సీయూ వద్ద అదుపు తప్పి ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అబ్దుల్ రహీం(25), ఎన్. మానసా(19), ఎం మానసా(23)లు అక్కడిక్కడే చనిపోయారు.
మరొకరు సాయి సిద్ధి(24) తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో కారు రెడు ముక్కలైంది. ప్రమాద సమయంలో కారు 200 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. చనిపోయిన ఈ ముగ్గురు అమీర్ పేటలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అబ్దుల్ బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఎన్. మానసా, ఎం. మానసాలు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అబ్దుల్ రహీం ప్రమాదానికి గురైన కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. సాయి సిద్ధి కూడా ఆర్టిస్టుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లంతా గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న సాయి సిద్ధి వద్దకు వచ్చి.. కారులో లింగంపల్లి వైపుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు పోలీసులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…