Featured

Singer sunitha: రెండవ పెళ్లి తర్వాత నా జీవితం ఇలా అవుతుందని ఊహించలేదు.. సునీత షాకింగ్ కామెంట్స్!

Singer sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే సునీత ఈ ఏడాది మొదట్లో తన స్నేహితుడు రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వివాహం తర్వాత సునీత పూర్తిగా తన కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వృత్తిపరమైన జీవితాన్ని మరొకవైపు వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీతకు తన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సునీత తనదైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చారు.

Singer sunitha: రెండవ పెళ్లి తర్వాత నా జీవితం ఇలా అవుతుందని ఊహించలేదు.. సునీత షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా ఆమె సమాధానం చెబుతూ వివాహం తర్వాత నా జీవితం ఎలా ఉందో నా ఫేస్ చూస్తే అర్థం అవుతోంది. నా జీవితంలో ఎంతో గౌరవంగా, నచ్చిన విధంగా బ్రతకాలి అనుకున్నాను ప్రస్తుతం అలాగే బ్రతుకుతున్నాను.వివాహం తర్వాత నా జీవితం ఇంత ఆనందంగా సంతోషంగా ఉంటుందని అనుకోలేదు అంటూ ఈమె తన రెండవ వివాహ జీవితం గురించి తెలిపారు.

Singer Sunitha: ఈ ఏడాది ఎంతో మందిని పోగొట్టుకున్నా..

ప్రస్తుతం తను, తన భర్త ఇద్దరూ ఒకే రంగంలో ఉండటం వల్ల ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ప్రొఫెషనల్ లైఫ్ తో పోలిస్తే పర్సనల్ లైఫ్ కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని ఈమె తెలియజేశారు. ఇక ఈ ఏడాదిలో ఎంతోమందిని పోగొట్టుకున్నానని ముఖ్యంగా బాలు గారి గురించి తలుచుకుని సునీత ఎమోషనల్ అయ్యారు. ఆయన మరణం తర్వాత కన్నీళ్ళు రావడం ఆగిపోయాయని ఈ ఇంటర్వ్యూలో సునీత బాలు గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో కీలక నిర్ణయం… 3 రోజుల పాటు అర్జిత సేవలు రద్దు!

తిరుమలలో భక్తులకు ముఖ్య సమాచారం వెలువడింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తిరుమల…

41 minutes ago

తడి జుట్టుకు టవల్ చుట్టడం ప్రమాదమా? తలస్నానం తర్వాత ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది!

తలస్నానం తర్వాత జుట్టును తుడిచేందుకు టవల్‌తో బిగిగా చుట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటు. ఇది జుట్టు త్వరగా ఆరిపోతుందనే…

2 hours ago

ఇంట్లోనే స్కిన్ కేర్… చింతపండు ట్రై చేశారా?

చర్మ సంరక్షణలో సహజమైన మార్గాలను అనుసరించాలనే ఆసక్తి ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చని…

2 hours ago

అక్షయ తృతీయ నుంచి నరసింహ జయంతి వరకు… వైశాఖ ప్రత్యేకత!

హిందూ పంచాంగంలో వైశాఖ మాసానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. చైత్రం తర్వాత వచ్చే ఈ నెలను శుభకార్యాలకు, పూజా…

3 hours ago

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే సులభ మార్గాలు ఇవే! ఉసిరికాయతో పూజ… శుభఫలితాలు వస్తాయా?

శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…

4 hours ago

దిండు జీవితకాలం ఎంత? పాత దిండు వాడుతున్నారా? షాకింగ్ విషయాలు ఇవే!

మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…

4 hours ago