Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఇదివరకే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన సన్నివేశాన్ని విడుదల చేశారు. ఇక ఈ సన్నివేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు ఎంతో అద్భుతమైన ఈ సీన్స్ డిలీట్ చేయకుండా ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారో తెలియదు కానీ ఇది కనుక సినిమాలో ఉంటే సినిమాకి మరింత హైప్ క్రియేట్ అయ్యేదని పలువురు భావిస్తున్నారు.
ఈ సినిమాలో డిలీట్ చేసిన సన్నివేశంలో పుష్ప తల్లి ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటుంది. అతను వచ్చి అప్పు తిరిగి చెల్లించాలని అందరి ముందు అవమాన పరుస్తారు. ఈ క్రమంలోనే తన కొడుకు మాట వినడం లేదని తన తల్లి బిడ్డ మాట వినదు.. ఈ గొడ్డు మాటవినదు అంటూ తిడుతుంది. ఇక ఆ అప్పు తీర్చడం కోసం పుష్ప ఆ బర్రెను అమ్మి తనకు అప్పు చెల్లిస్తాడు. ఊరందరి ముందు తనని అప్పు అడుగుతూ వారిని అవమానపరిచిన ఈ విధంగా వారందరికీ తన అప్పులు తీర్చినట్టు తెలిసేలా తనని కొట్టుకుంటూ ఊరంతా తిప్పుతాడు. ప్రస్తుతం ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…