Super Star Krishna: ఇప్పటి పిల్లలకి మహేష్ బాబు ఫాదర్ గా తెలిసినా కొంచెం వెనక్కి వెళితే సూపర్ స్టార్ కృష్ణ క్రేజ్ వేరు. ఆయనొక టాలీవుడ్ కౌ బాయ్, మాస్ హీరో ఇమేజ్ తో విభిన్న కథలతో ప్రయోగాలు చేసిన టాప్ హీరో. కమర్షియలా హీరోగా భారీ సక్సెస్ లు చూసిన కృష్ణ గారు ఏ మాత్రం సంశయించకుండా గూఢచారి, మోసగాళ్ళకు మోసగాడు వంటి సినిమాలతో అలరించాడు. ఒకానొక సమయంలో ఒక సంవత్సరంలో 10 సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం. 80ఏళ్ల కృష్ణ గారు ఇప్పటికి ఆరోగ్యాంగా ఉండటానికి సీక్రెట్స్ ఐటీవలే షేర్ చేసారు.
80 ఏళ్లలోనూ ఆరోగ్యంగా ఉండటానికి కారణం….
ఇటీవల కృష్ణగారి పుట్టినరోజు సందర్బంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆయన తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పారు. రోజు ఆయన దినచర్య వివరించారు. పని లేకపోతే బయటికి వెళ్ళడానికి ఇష్టపడట కృష్ణ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారట. ఇక వ్యాయామం, అదేపనిగా జాగ్రత్తలు తీసుకోవడం అలాంటివి ఏం లేవని వివరించారు. ఉదయాన్నే లీటరు నీళ్లను తాగడంతో దినచర్య మొదలవుతుంది. ఆ తరువాత గంట గ్యాప్ ఇచ్చి జ్యూస్ తాగి స్నానం చేసాక టిఫిన్ తింటానని టిఫిన్స్ లో ఇడ్లీ, దోస ఇష్టంగా తినే టిఫిన్స్ అని వెల్లడించారు. ఇక 11 గంటల సమయంలో మజ్జిగ తీసుకుని, మధ్యాహ్నం ఫుల్ గా భోంచేస్తారట. ఇక సాయంత్రం జున్ను తిని, రాత్రికి చపాతీ చికెన్ కర్రీ ఇష్టంగా తింటానని చెప్పారు.
కొన్ని ఏళ్లుగా నా బరువు 76, 77 గానే ఉందని మారలేదని అందుకే మళ్ళీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం రాలేదు అని వివరించారు. ఇక అల్లూరి సీతా రామరాజు సినిమా వరకు కూడా రోజుకి 17 గంటలు పని చేసే వాడినని అలా పనిచేయడం వల్ల ప్రత్యేకంగా మళ్ళీ వ్యాయామాలు అవసరం రాలేదని చెప్పారు ఇప్పుడున్నట్లు క్యారెవాన్లు అప్పుడు లేవని చెప్పారు. అల్లూరి సినిమా తరువాత రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే వాడినని చెప్పారు. ఇపుడు ఖాళీగా సమయం ఉండటం వల్ల యోగా వ్యాయామం వంటివి చేస్తున్నానని చెప్పారు. ఇప్పటికి ఎంతో ఆరోగ్యంగా ఉన్న కృష్ణ గారు ఇప్పటికి తన తనయుడు మహేష్ సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…