Featured

Super Star Rajnikanth : రజినీపై వైసీపీ ఇంత ఘోరంగా ట్రోలింగా? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి రావడమే ఆయన చేసిన తప్పా?

Super Star Rajnikanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయనకు ఉన్నంత క్రేజ్ సౌత్ ఇండియాలో ఏ హీరోకి లేదు. ఏడు పదుల వయసులో కూడా యూత్ మొదలు అన్ని వయసుల వారూ ఆయనను అభిమానిస్తారు. ఆయనను చూసినప్పుడు ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే అనిపిస్తుంది. రజినీ కాంత్ ఏ రాష్ట్రానికి అయినా వస్తున్నారంటే ఆయనను చూసేందుకు జనం క్యూ కడతారు. ఆయనకు బ్రహ్మరథం పడతారు. రాష్ట్ర నేతలు సైతం రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తారు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఎవరు వచ్చినా సరే.. రాజకీయ కోణంలోనే చూస్తారు.. అలాగే ఆలోచిస్తారనడానికి రజినీ రాకే నిదర్శనం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను టీడీపీ పెద్ద ఎత్తున విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఆహ్వానించింది. ఆయన కూడా కాదనుకుండా కార్యక్రమానికి వచ్చారు. సీన్ కట్ చేస్తే.. ఆయనపై దారుణమైన ట్రోల్స్.. సెటైర్స్.. మీమ్స్..

దేనితో నవ్వాలో కూడా అర్ధం కావట్లేదు..

రజినీకాంత్ కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే వచ్చారంటూ వైసీపీ కార్యకర్తలు,సీఎం జగన్ అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. రజినీని విమర్శిస్తూ దారుణంగా పోస్టులు పెట్టారు. ‘‘సొంత రాష్ట్రాల్లో ఏం వెలగపెట్టని మహానుభావులు అందరూ వచ్చి ఇక్కడ ఏం పీకలేని వాడికి కలరింగ్ ఇవ్వడం ఏదైతో ఉందో.. దేనితో నవ్వాలో కూడా అర్ధం కావట్లేదు’’ ఇది ఏ పార్టీ అభిమాని పెట్టిన పోస్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘‘2024లో జగన్‌ను ఢీకొట్టాలంటే లోకేష్ వల్ల, పవన్ కల్యాణ్ వల్ల కాదని అర్థమై పాపం ఇప్పుడు వెన్నుపోటుకి హెల్ప్ చేసిన రజినీ కాంత్‌ను తీసుకొచ్చారు. బాబు నువ్వు హీరోలని, మీడియాను నమ్మితే జగన్ ప్రజలను నమ్ముతున్నాడు’’ అంటూ మరో పోస్ట్. ఇవేనా దారుణమైన పోస్టులు మరెన్నో. ఆయన చేసిన పాపమల్లా కాస్త చంద్రబాబు గురించి మాట్లాడటమే. అదే వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అవేమీ పట్టలేదు. కేవలం చంద్రబాబును ప్రశంసించడమే నేరమైంది. అక్కడితో ఆగలేదు. పర్సనల్‌గా కూడా విమర్శిస్తున్నారు. ఆయన కూతుళ్లను కూడా సీన్‌లోకి తీసుకొచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు.

రాజకీయం మాట్లాడకపోతే సభా సంస్కారం కాదు..

ఎక్కడ ఏం మాట్లాడాలో సూపర్ స్టార్‌కు తెలియనిది కాదు. నిన్న సభలో ఆయన చాలా హూందాగానే వ్యవహరించారు. ఏం మాట్లాడాలో జ్ఞానం, బుద్ధి చెబుతాయని.. ఎలా మాట్లాడాలో సమర్థత చెబుతుందని రజినీ అన్నారు. ఇక ఎంతసేపు మాట్లాడాలో సభ చెబుతుందని.. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుందన్నారు. ఇంత పెద్ద సభను చూస్తే తనకు రాజకీయం మాట్లాడాలని ఉన్నా కూడా.. జాగ్రత్త.. రాజకీయం ఇక్కడ మాట్లాడొద్దని అనుభవం చెబుతోందని రజినీ అన్నారు. కానీ ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన గురించి కొద్దిగా అయినా రాజకీయం మాట్లాడకపోతే అది సభా సంస్కారం కాదు అని చెప్పి మరీ ఆయన గురించి మాట్లాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్‌ 2047 ఒక అద్భుతమని, అది అమలైతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తుందని రజినీ పేర్కొన్నారు. ఆ వేదికపై ఏపీ సీఎం జగన్ ఉన్నా మరొకరు ఉన్నా కూడా ఆయన మాట్లాడి ఉండేవారు. చంద్రబాబుతో పరిచయం, హైదరాబాద్ డెవలప్‌మెంట్ తదితర విషయాల మీద కాసేపు మాట్లాడారు. నిజానికి ఎవరు అవునన్నా కాదన్నా.. హైదరాబాద్ అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన అభివృద్ధి మాత్రం మరువలేనిది. అది ఎవరూ కాదనలేనిది.

ఎరక్క పోయి ఏపీకి వెళ్లామనుకుంటారేమో..

రజినీ కాంత్ అనే కాదు.. ఎవరు మన రాష్ట్రానికి వచ్చినా కూడా వారిని గౌరవించడం మన సాంప్రదాయం. దానిని మరిచి ఈ ట్రోల్స్ ఏమిటి? ఇది చూసి మరొకరు ఎవరైనా మన రాష్ట్రానికి రావడానికి సాహసిస్తారా? ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుని సైలెంట్ అయిపోతారు. ఎరక్కిపోయి ఏపీకి వెళ్లామని రజినీ సైతం ఈ ట్రోల్స్ చూస్తే అనుకుంటారేమో. ఏదైనా ఉంటే మన ప్రత్యర్థితో చూసుకోవాలి కానీ అతిథులుగా వచ్చిన వారిపై ప్రతాపం ఎందుకు? అందునా రజినీ అసలు వివాదాల జోలికి వెళ్లేవారు కాదు. తన పనేంటో తాను చూసుకుంటారు. రాజకీయ పార్టీ పెడదామనుకుని సైతం ఈ విమర్శలు.. ప్రతి విమర్శలు ఎందుకు? అనుకున్నారేమో కానీ వెనక్కి తగ్గారు. అలాంటి రజినీపై ఇలాంటి ట్రోల్స్ దారుణం కదా.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago