ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన చనిపోయాడంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు కూడా రాసాయి.. అదేసమయంలో కిమ్ కి బదులుగా అయన సోదరి ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టనుందని చెప్పుకొచ్చాయి. అయితే ఈ వార్తలు అన్ని కట్టుకథలే, కిమ్ ఆరోగ్యంగా ఉన్నాడు అంటూ మే 2న ఉత్తర కొరియా కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది.
గతంలో హిట్లర్ లాంటి నేతలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే ముందు తమకు బదులు వారి డూప్ ను పంపేవారు. తాజగా కిమ్ కూడా అదే చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఫోటోలలో ఉన్నది కిమ్ కాదని, అచ్చం కిమ్ లానే ఉన్న మరో వ్యక్తి అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ బ్రిటిష్ సభ్యురాలు లూయిస్ మెన్చ్ కిమ్ పాత ఫొటోలతో పోల్చి చూసి కిమ్ పళ్ళ వరసకు ఇప్పటి ఫోటోలు ఉన్న పళ్ళ వరసకు చాలా వ్యత్యాసం కనిపిస్తుందని తన ట్విట్టర్ ఖతాలో ఆ రెండు ఫొటోలతో పోస్ట్ చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…