Featured

Supritha : పెళ్లేచేసుకుందామా అని అడిగిన నెటిజన్… షాకింగ్ రిప్లై ఇచ్చిన సుప్రీత…!

Supritha : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను చేసి గుర్తింవు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. భద్ర, రెడీ, బొమ్మరిల్లు వంటి సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. బిజీ ఆర్టిస్ట్ గా చేతి నిండా సినిమాలతో ఉన్న సురేఖ ఈమధ్య కాలంలో సినిమాలను తగ్గించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో కూతురు సుప్రీతతో కలిసి రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక సుప్రీతను కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ఇపుడు ప్రయత్నిస్తోంది. ఇక సుప్రీత కూడా గ్లామర్ డోస్ పెంచేసి నెట్టింట్లో ఫోటో షూట్లతో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సురేఖ తన కూతురుని సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని చాలా ప్రయత్నిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో డాన్స్ లేస్తు నెగెటివిటీ ఎంత ఉన్నా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. నెగెటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్న అదే స్థాయిలో వీరికి ఫాలోయింగ్ కూడా ఉంది.

తుంటరి ప్రశ్న అడిగిన నెటిజన్… షాకింగ్ ఆన్సర్ ఇచ్చినా సుప్రీత…

సుప్రీత సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయి సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. లేచింది మహిళా లోకం అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఓ వైపు సినిమాల కోసం ప్రిపేర్ అవుతూనే మరో వైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రీల్స్ అంటూ ఫోటో షూట్స్, చిట్ చాట్స్ అంటూ హంగామా చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో సుప్రీతకు ఒక వింత అనుభవం ఎదురైంది.

ఒక నెటిజన్ ఏకంగా పెళ్లి చేసుకుందామా? అని అడిగడం ఒకింత సుప్రీత ను షాక్ కి గురిచేసింది. అయితే వెంటనే ఆ సదరు నెటిజన్ కు తన స్టైల్ సమాధానం చెప్పింది. మా అమ్మకి చెబుతా తానే నీ సంగతి చూస్తుంది..అయితే ఆతరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు… తెలిసిన నాకు సంబంధం లేదు భయ్యా అంటూ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago