Chiranjeevi -surekha: కలెక్టర్ ని కాదనుకొని చిరంజీవిని పెళ్లి చేసుకున్న సురేఖ.. అందుకు కారణం అదేనా?
Chiranjeevi -surekha : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పునాది రాళ్ళు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి తన ప్రతిభతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇలా మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు.
ఇదిలా ఉండగా చిరంజీవి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి పెళ్ళి గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి. చిరంజీవి, సురేఖ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం ఒక ప్రముఖ నటుడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అల్లు రామలింగయ్య మొదట సురేఖని ఒక కలెక్టర్ కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడట. కానీ ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్ళి చేశారు.
సురేఖ పెళ్ళి విషయంలో ఆమె తండ్రీ అల్లు రామలింగయ్య ఆయనకి అత్యంత సన్నిహితుడైన ప్రభాకర్ రెడ్డితో చర్చించాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకర్ రెడ్డి భార్య బయటపెట్టింది. తాజాగా ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని చిరంజీవి పెళ్ళి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకరోజు అల్లు రామలింగయ్య వచ్చి సురేఖకి కలెక్టర్ సంబంధం రెడీగా ఉంది.. చిరంజీవి కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయమంటావ్..’’ అని ప్రభాకర్ రెడ్డిగారిని అడిగారు.
అప్పుడు ఆయన పిల్లలకి నచ్చివన్ని తెచ్చి ఇస్తాం. కలెక్టర్ సంబంధం కూడ మంచిదే. కానీ సురేఖకి ఇష్టమైన వ్యక్తికి ఇచ్చి పెళ్ళి జరిపించు అని చెప్పాడట. కానీ చిరంజీవి పైకి వస్తాడా అని అల్లు రామలింగయ్య అనుమాన పడితే..సురేఖ అదృష్టవంతురాలు అయితే తప్పకుండా పైకి వస్తాడని చెప్పాడట. దీంతో అల్లు రామలింగయ్య సురేఖని అడగగా చిరంజీవిని చేసుకోటానికి ఇష్టపడింది. దీంతో అల్లు రామలింగయ్య తన కూతురుని చిరంజీవికి ఇచ్చి పెళ్లి జరిపించాడు.. అంటూ సంయుక్త గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రభాకర్ రెడ్డి గారి సలహా వల్ల సురేఖ, చిరంజీవిల పెళ్ళి జరిగింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…