Surekha Vaani and supreetha holding wine glasses : టీవీ యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సురేఖ వాణి మొగుడ్స్ పెళ్లామ్స్ ప్రోగ్రామ్ తో అభిమానులను సంపాదించుకుంది. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్క, వదిన, అత్త, అమ్మ వంటి పాత్రల్లో నటిస్తూ కామెడీ కూడా పండించే సురేఖ వాణి, కొన్ని సినిమాలలో సీరియస్ రోల్స్ కూడా చేశారు. ఈ మధ్య ఎక్కువగా సురేఖవాణి సినిమాలలో కనిపించడం లేదు కానీ కూతురితో కలిసి సోషల్ మీడియాలో మాత్రం పార్టీ, డాన్స్, ట్రిప్ లకీ సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటారు. రెండేళ్ల క్రితం 2019లో తన భర్తను కోల్పోయిన సురేఖవాణి బాగా డిప్రెషన్లోకి వెళ్లి తర్వాత తన కూతురు ద్వారా కోలుకున్నట్టు తెలిసిందే.
తన కూతురితో కలిసి మోడరన్ మామ్ గా సురేఖ వాణి సుప్రీత సోషియల్ మీడియాలో పెట్టే పోస్టులకు ఫాలోయర్స్ కూడా బాగానే ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో సుప్రీత తన మామ్ తో కలిసి డాన్స్ చేసిన ఫోటోలు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సురేఖవాణి తో సమానంగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. కాగా ఇటీవల ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియా లో ఫోటోని షేర్ చేయగా,అది హాట్ టాపిక్ గా మారింది.
చేతిలో మందు గ్లాసులతో తల్లికూతుళ్లు….
ఇటీవల సురేఖవాణి, సుప్రీత థాయిలాండ్ ట్రిప్ వెళ్లినట్టు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో చేయగా ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ ప్రయాణంలో భాగంగా ఫ్లైట్లో చేతిలో మందు గ్లాసు లతో తల్లీకూతుళ్లు చేసిన ఎంజాయ్ మాములుగా లేదు. ఈ ఫోటోతో ఆగకుండా సుప్రీత తాను థాయ్ మసాజ్ చేయించుకుంటున్న ఫోటో ని కూడా షేర్ చేసి ధరణి అవాక్కయ్యేలా చేసింది. ఈ తల్లీకూతుళ్లు ఎంజాయ్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…