Priyanka Jain: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీరియల్ నటి ప్రియాంక జైన్ ఒకరు. ఈమె ముంబైకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ లో నటిస్తూ తెలుగు అమ్మాయిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె మౌనరాగం జానకి కలగనలేదు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా బుల్లితెర నటిగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రియాంక ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ నటుడు శివకుమార్ తో ప్రేమలో పడ్డారు ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు.
ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది వీరి పెళ్లి ఈ ఏడాది జరగబోతుంది అంటూ ఇటీవల వీరిద్దరూ ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ఇదిలా ఉండగా శివ ప్రియాంక ఇద్దరు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రియాంకకు సర్జరీ జరుగుతుందని తనకు చాలా టెన్షన్ గా అనిపిస్తుందని శివకుమార్ ఒక వీడియో షేర్ చేశారు.
ఐ సర్జరీ…
ప్రియాంకకు చిన్నప్పటి నుంచి కంటి చూపు సమస్య ఉందని అందుకే తను ఎక్కువగా కళ్లజోడు పెట్టుకొని ఉంటారని శివకుమార్ తెలిపారు. అయితే షూటింగ్స్ లేదా ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఈమె లెన్సెస్ వాడుతూ ఉంటారు. ఇలా లెన్సెస్ పెట్టుకోవడం తనకు చాలా ఇబ్బందిగా ఉందని అందుకే శాశ్వత పరిష్కారం కోసం ఐ సర్జరీ చేయించుకోబోతుంది అంటూ శివకుమార్ వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ షేర్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…