Movie News

Mahesh Babu: నాన్ననుంచే ఆ అలవాటు నేర్చుకున్న… నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికీ తనే: మహేష్ బాబు

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలవుతుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మహేష్ బాబు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు దుబాయ్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇలా దుబాయ్ నుంచి ఈయన హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా మారిపోయారు.

మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరియర్ మొదట్లో నేను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నేను కృష్ణ గారి అబ్బాయి అనే ఒత్తిడి నాపై ఎక్కువగా ఉండేది దీంతో ఏం చేయాలో తెలియక రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా సినిమాలు చేశానని మహేష్ బాబు తెలిపారు.

ఇక చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడంతో నాన్నలో ఉన్నటువంటి క్రమశిక్షణను నేను అలవాటు చేసుకున్నానని ఈయన వెల్లడించారు. మురారి సినిమా సమయంలో నాన్న నాతో పాటు థియేటర్లో సినిమా చూశారు .అసలు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని నేను కంగారుపడగా నాన్న మాత్రం నా భుజంపై చేయి వేశారు. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేనని మహేష్ బాబు తెలిపారు. ఇక ఒక్కడు సినిమా తర్వాత నాకు మంచి ధైర్యం వచ్చిందని ఈయన వెల్లడించారు.

నమ్రత బెస్ట్ ఫ్రెండ్…

ఇక మహేష్ బాబు తరచూ వెకేషన్స్ వెళ్లడం గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. నాకు చాలా సరదాగా గడపడం ఇష్టం కానీ ఇక్కడ అలా గడపడానికి వీలుకాదు అందుకే నేను విదేశాలకు వెళ్తానని అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నేను రీఛార్జ్ అయ్యాను అన్న ఫీలింగ్ నాలో ఉంటుందని అందుకే వెళుతూ ఉంటానని తెలిపారు. ఇక మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో తన భార్య నమ్రత తనకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago