Aadi Reddy: ఆదిరెడ్డి పరిచయం అవసరం లేని పేరు ఒక కామన్ మాన్ గా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించినటువంటి రివ్యూలు ఇస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ఆదిరెడ్డికి ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ఈయన బయటకు వచ్చారు.
ఒకప్పుడు కఠిన పేదరికంలో ఉన్నటువంటి ఈయన బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ భారీగా సంపాదించారు. ఇకపోతే ఒకానొక సమయంలో ఈయన లక్షల్లో ఆదాయం వచ్చిందని కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆదిరెడ్డి లక్షల్లో సంపాదించడమే కాకుండా కారు బంగ్లాలు అంటూ నేడు గొప్ప స్థాయికి చేరుకున్నారు. అయితే ఇటీవల ఆదిరెడ్డికి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ప్రశ్న ఎదురయింది.
లక్షల్లో సంపాదన ఆస్తులు బంగ్లాలు కార్లు ఉన్నా కూడా ఎందుకని మీరు మీ చెల్లికి పెళ్లి చేయలేదు అనే ప్రశ్న ఆదిరెడ్డికి ఎదురయింది. ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మి ప్రస్తుతం తన ఇంట్లోనే ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నా చెల్లెలు నాగలక్ష్మికి ఐదు శాతం మాత్రమే చూపు ఉంది ఆమెకు ఆపరేషన్ చేయించిన కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పారు.
కంటి చూపు రాదు…
ఒకసారి ఇంట్లో మొత్తం తిరిగింది అంటే ఆమె ఏ వస్తువు ఎక్కడ ఉందనే విషయాలను గుర్తిస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసే అత్తారింటికి పంపించి అక్కడ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్న ఉద్దేశంతోనే నేను తనకి పెళ్లి చేయలేదని తన చెల్లెలను తన భార్య కవిత చూసుకుంటుందని వారిద్దరూ చాలా మంచిగా ఉంటారు అంటూ ఈ సందర్భంగా ఆదిరెడ్డి తన చెల్లికి పెళ్లి చేయడం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…