Movie News

Manchu Manoj – Mounika: మరోసారి మంచి మనసు చాటుకున్న మౌనిక మనోజ్ దంపతులు.. ఏమైందంటే?

Manchu Manoj – Mounika: మంచు మనోజ్ భూమా మౌనిక గత ఏడాది మార్చి నెలలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ రెండో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మనోజ్ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడపడమే కాకుండా వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు.

ఇకపోతే ఇటీవల మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాననే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం మౌనిక ఐదో నెల ప్రెగ్నెంట్ అంటూ మనోజ్ అందరికీ శుభవార్తను తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే మౌనిక ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొదటిసారి వీరిద్దరూ బయటకు రావడంతో మౌనిక బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక మంచు మనోజ్ నటుడిగా మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా ముందు వరుసలో ఉంటారని సంగతి మనకు తెలిసిందే. ఈయన పలు సందర్భాలలో అనాధాశ్రమాలను సందర్శించి అక్కడ పిల్లలకు నిత్యవసర వస్తువులను అందిస్తూ ఉంటారు అయితే తాజాగా మౌనికతో కలిసి ఈయన అనాధాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. స్వయంగా మనోజ్ మౌనిక ఇద్దరు కూడా వారికి వడ్డించారు.

బేబీ బంప్ తో మౌనిక..

ఇలా మనోజ్ మౌనిక అనాధ పిల్లల కడుపునిండా భోజనం పెట్టి మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఎంతోమంది అభిమానులు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోలలో మౌనిక బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది.

https://www.instagram.com/reel/C11XzkSpd3x/?utm_source=ig_web_copy_link

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago