Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా వేడుకను గుంటూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన తండ్రి కృష్ణ మరణించిన తర్వాత మొదటి సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ఈ వేదికపై మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతికి నా సినిమా వస్తే హిట్ అవుతుందన్న సెంటిమెంట్ మాలో ఉందని తెలిపారు.
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను చూసి నాన్న నాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపేవారు కానీ ఈసారి నాన్న లేరు. ఇకపై ఆ విషయాలన్నీ మీరే నాకు తెలియచేయాలి. మీరే నా అమ్మానాన్న అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన ఎమోషనల్ కామెంట్ చేయడమే కాకుండా అభిమానులందరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇలా తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ అవడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
నాకన్నీ మీరే…
ఇక మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాకి కూడా కృష్ణ తన అభిప్రాయాలను తెలియజేసే వారు మొదటిసారి కృష్ణ గారు లేకుండా గుంటూరు కారం సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో మహేష్ బాబు తన తండ్రిని గుర్తుచేసుకొని ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…