Movie News

Suriya: పది భాషలలో సూర్య సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్య వరుస సినిమాలలో నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. సూర్య రెగ్యులర్ కథలకు కాకుండా వైవిద్యమైన కథలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సూర్యకి కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషకు మాత్రమే పరిమితమైన సూర్య సినిమాలు ఇకపై పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం సూర్య తన 42వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో 10 భాషలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కథనాలు చాలా భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా మీద మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు.

Suriya: ముహూర్తం పిక్స్…

తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 9:05 నిమిషాలకు సూర్య నటిస్తున్న 42 వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో గుర్రం మీద ఎక్కి విల్లు భాణాలతో.. గుర్రాలపై వేటాడే ఒక వేటగాడుగా ఉన్నాడు. ఆ గుర్రంపై ఒక కొండ కొస నుంచి మరో కొండపైకి జంప్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago