Categories: FeaturedMovie News

Surya kiran : అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాను… బాలకృష్ణ తో సినిమా ఆగిపోవడానికి కారణం అదే : సూర్య కిరణ్

Surya Kiran : చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో రజనీకాంత్, కమలహాసన్ వంటి దిగ్గజ నటులతో నటించిన, మాస్టర్ సురేష్ గా సుపరిచితుడైన సూర్య కిరణ్ ఆ తరువాత నటన నుండి డైరెక్షన్ వైపు వచ్చారు. దర్శకుడిగా తెలుగులో ఏఎన్ఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ హీరోగా సత్యం సినిమా తీశారు. ఈ సినిమా లో సుమంత్ నటన, సూర్య కిరణ్ టేకింగ్ సినిమాను మంచి ఫీల్ గుడ్ మూవీలా చేసాయి. సినిమా సూపర్ హిట్ అయింది. దర్శకుడిగా సూర్య కిరణ్ ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

బిగ్ బాస్ కి అందుకే వెళ్ళాను, బాలయ్య సినిమా ఆగిపోయింది…

ఇక సత్యం హిట్ తరువాత సూర్య కిరణ్ ధన 51 సినిమా చేసారు మళ్ళీ సుమంత్ తోనే కానీ అది కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఇక మళ్ళీ తీసిన బ్రహ్మాస్త్రం వంటి సినిమాలు చేసిన అవి పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ కళ్యాణి తో పెళ్లి ఆ తరువాత విడాకులు వంటి విషయాలు, కెరీర్ లో హిట్లు లేక పోవడంతో సూర్య కిరణ్ మరో వైపు ఆర్థిక ఇబ్బందులకు నడుమ బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు.

బిగ్ బాస్ లో ఒక మూడు వారాలు ఉండి బయటకి వచ్చిన మళ్ళీ ప్రేక్షకులకు దగ్గర అవ్వొచ్చు, అలాగే నేను చేసిన సినిమా ప్రొమోషన్స్ మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ అవకాశం వస్తే వెళ్లి ప్రొమోషన్స్ చేసుకోవచ్చు, ఇక డబ్బు కుడా వస్తుంది అని పక్కా ప్లాన్ తో వెళ్ళాను కానీ నేను అనుకున్న విషయాలు జరగలేదు అంటూ చెప్పాడు. ఇక బాలకృష్ణ తో సినిమాకు అన్ని ఓకే అనుకున్నాక నేనే వెనకడుగు వేసాను ఆ తరువాత మళ్ళీ ఆయన విజయవాడ వచ్చి కలవమని చెప్పారు కానీ నేను వెళ్లలేక పోయాను అలా బాలయ్య బాబు తో ఆఫర్ మిస్ చేసుకున్నా. కానీ ఇపుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అది పూర్తి చేసాక మళ్ళీ బాలయ్యని కలిసి సినిమా అడుగుతా. ఇక ప్రభుదేవా తో ఒక పాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ రాసుకున్నా, అది ఈ రెండు సినిమాల తరువాత చేస్తా అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago