Categories: FeaturedMovie News

Surya Kiran : నేను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు వేలం వేశారు.. కళ్యాణి మళ్ళీ నా జీవితంలోకి వస్తే ఏం చేస్తానంటే : సూర్య కిరణ్

Surya Kiran : సత్యం సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన సూర్య కిరణ్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ధన 51, రాజు భాయ్, బ్రహ్మాస్త్రం, చాప్టర్ 6 వంటి సినిమాలు తీసినా పెద్దగా ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ చాలా మందికి తెలియని మరో సంగతి సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 సినిమాల్లో నటించాడు. మాస్టర్ సురేష్ పేరుతో తన చెల్లి తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసారు.

కళ్యాణి మళ్ళీ కనబడితే అలా చెబుతా…

ప్రస్తుతం బుల్లితెర మీద మంచి గుర్తింపుతో కొనసాగుతున్న నటి సుజిత.. సూర్య కిరణ్ చెల్లెలు. ఇక సూర్య కిరణ్, హీరోయిన్ కళ్యాణి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వారి వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అయితే డివోర్స్ తీసుకునే సమయంలో కూడా జడ్జి కారణాలు ఏంటని అడిగితే కొడతాడా, వేధిస్తున్నాడా అని అడిగితే లేదని చెప్పింది. పిల్లలు ఎవరితో ఉండాలి అని అనుకుంటున్నారు అని జడ్జి అడిగితే పిల్లలు ఇంకా లేరని చెప్పగా అందుకే విడిపోతున్నారా అని జడ్జి అంటే అవును అని చెప్పింది. విడాకులయ్యాక కూడా కళ్యాణి కి చెప్పాను నేను చేసిన అప్పులన్నీ తీర్చాక మళ్ళీ నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటా అని అంటూ సూర్య కిరణ్ చెప్పారు.

ఇక తన ఇప్పటి జీవితం రీ ఎంట్రీ కాదు తొలి ఎంట్రీ అని గతాన్ని మర్చి పోయిన కొత్త మనిషి లాగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తానని చెప్పాడు. ఈ జర్నీ లో కళ్యాణి కనిపిస్తే పలకరిస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను పరిచయం చేసుకుంటా అంటూ చెప్పారు. ఇక తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని బ్యాంకు వాళ్ళు వేలం వేసినపుడు చాలా బాధ పడ్డానని అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు, ఆ నిమిషం నాకు చిన్నప్పటి నుండి వచ్చిన అవార్డులు అన్ని అక్కడే ఉండిపోయాయి. అవి తెచ్చుకోవాలనే ధ్యాస కూడా కలుగలేదు అంటూ ఎమోషనల్ గా చెప్పారు. మళ్ళీ కథలు రాసుకుని మంచి సినిమాలు తీస్తా బాగా డబ్బులు సంపాదిస్తానని ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago