బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసులో రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు రోజురోజుకీ మరింత బిగుసుకుంటుంది. అసలెందుకు రియాను కాపాడుతున్నారు.? ముంబై పోలీసులు ఎందుకు రియాను అరెస్ట్ చేయడం లేదు.? ఆమెను కేసులోంచి బయటికి తీసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సందర్భంగా బీహార్ పోలీసులు ముంబై వెళ్లి అక్కడ తమ విచారణ మొదలు పెట్టారు. అయితే అక్కడ ముంబై పోలీసుల నుంచి బీహార్ పోలీసులకు ఎలాంటి సహకారం అందడం లేదు. పైగా రియా చాలా రోజుల నుంచి మీడియాకు దూరంగా ఉంటుంది. అసలామె ఎక్కడ ఉందనేది కూడా ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా రియా చక్రవర్తి ఇంటికి ముంబై పోలీసులు వెళ్లగా అక్కడ ఆమె లేదని తెలిసింది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పులివాసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సూపర్ మచ్చి’ చిత్రంలో రియా చక్రవర్తి ఓ హీరోయిన్ గా నటించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ‘సూపర్ మచ్చి’ చిత్రం శరవేగంగానే షూటింగ్ జరుపుకుంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఈమధ్యనే మళ్ళీ ప్రారంభమైంది. గ్యాప్ లేకుండా కళ్యాణ్ దేవ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కళ్యాణ్ దేవ్ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు. “ముందుగా ‘సూపర్ మచ్చి’ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకున్నారు. రియా చక్రవర్తి గతంలో ‘తూనీగా తూనీగా’ తెలుగు చిత్రంలో కూడా నటించింది. అంతా బాగానే ఉంది కానీ రియాపై వస్తున్న విమర్శల వలన త్వరలో విడుదల కానున్న ‘సూపర్ మచ్చీ’ సినిమా ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంటుందా లేదా.? అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లోహాట్ టాపిక్ గా మారింది. తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే రియా చక్రవర్తి ఇప్పుడప్పుడే సినీరంగంలో బిజీ అయ్యేలా కనిపించడం లేదు. రియాకు మళ్ళీ సినిమా ఛాన్స్ లు వస్తాయా లేదా అనేది కూడా సందేహమే. సుశాంత్ కేసు నుండి ఎలాగైనా నిర్దోషిగా బయట పడాలని రియా తీవ్రంగానే తన ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ కేసు ముగిసిన తర్వాతైనా రియా సినిమా లైఫ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…