బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న వాళ్ళ దగ్గర్నుంచి వస్తున్న సమాచారంతో కేసు క్రొత్త మలుపు తిరుగుతుంది. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారుతోంది. ప్రతి మలుపు కూడా సుశాంత్ ప్రియురాలు రియా దగ్గరకే చేరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య తెలియ జేసిన అంశాలను చదివితే మీరూ విస్తుపోవడం ఖాయం.
వివరాల్లోకి వెళ్తే.. ఓ జాతీయ వార్తా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అంకిత్ ఆచార్య మాట్లాడుతూ.. ‘సుశాంత్‌తో నేను గత మూడేళ్ళుగా అతని నీడలా కలిసి పని చేశాను. ఆ టైంలో సుశాంత్ చాలా చురుగ్గా ఉండేవాడు. ఇన్నేళ్లలో బాంద్రాలోని తన ఇంట్లో లోపల ఎప్పుడూ గడియ పెట్టుకోవడం నాకు తెలీదు. కానీ.. బాంద్రాలోని అపార్ట్‌మెంట్ లో సుశాంత్ విగతజీవిగా పడి ఉన్న టైంలో సుశాంత్ భయ్యా ఉరివేసుకున్నప్పుడు లోపల గడియ పెట్టుకున్నాడని తెలిసి బాధనిపించింది. ఆగస్ట్ 2019లో ఒకసారి నేను నా సొంత ఊరు వెళ్లాను. తిరిగొచ్చేసరికి సుశాంత్ స్టాఫ్ అంతా మారిపోయి కొత్త వాళ్ళున్నారు. గతంలో పనిచేసిన వారెవరూలేరు. వీళ్ళందర్నీ రియా మేడమ్ మార్చి ఉండొచ్చని భావించాను. సుశాంత్ దగ్గర కొత్తగా పనిచేస్తున్న బాడీగార్డ్స్ నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు.
2019 సెప్టెంబర్‌లో నాకివ్వాల్సిన డబ్బులను కూడా సుశాంత్ ఇచ్చేశాడు. ఆ టైంలో అతని ముఖంలో నవ్వు లేదు, తీవ్ర మానసిక వేదన కనిపించింది. మనిషి పూర్తిగా మారిపోయాడు. అప్పటికే సుశాంత్ అకౌంట్లో 30 కోట్లు ఉన్నట్టు నాకు తెలుసు. రియా మేడమ్ విచ్చలవిడిగా ఆ డబ్బును ఖర్చు చేయడం కూడా నాకు తెలుసు. సుశాంత్ ఇంట్లో ఎలాంటి విగ్రహాలు లేకుండానే రియా పూజలు జరిపేది. సుశాంత్ ఎలాంటి మందులు కూడా వాడే వాడు కాదు’ అని తెలియజేశాడు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ సుశాంత్ కేసులో ముఖ్యమైన ఆధారాలుగా మారాయి. చూద్దాం.. ఈ కేసు ఇంకెన్ని క్రొత్త మలుపులు తిరుగుతుందో..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…