AP Election Result: ఏపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇలా అధికారంలోకి ఎవరు రాబోతున్నారనే విషయం గురించి ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి.
పలు సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా రాగా మరికొన్ని వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా వచ్చాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ప్రజలకు క్లారిటీ లేకపోవడంతో ఎన్నికల ఫలితాల పై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే తాజాగా పరిపూర్ణానంద స్వామివారు ఏపీ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
స్వామి పరిపూర్ణానంద బీజేపీ తరపున హిందూపురంలో పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి కారణంగా టీడీపీకి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. అయితే హిందూపురంలో కూడా ఎవరు ఊహించని పరిణామం జరగబోతుందని ఈయన తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం తిరిగి ఏపీలో జగన్ అధికారంలోకి రాబోతున్నారని వెల్లడించారు.
జగన్ కే విజయం..
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో జగన్, కేంద్రంలో మోడీ విజయం సాధిస్తారని ఈ సందర్భంగా పరిపూర్ణానంద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…